ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే బీరు తయారీలోకి వినియోగించే ప్రధాన ముడి పదార్థం బార్లీ ఉత్పత్తిలో రష్యా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. బీర్ తయారీకి మరొక ముడి పదార్థం మాల్ట్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆగకుండా ఇలాగే మరికొంత కాలం జరిగితే బార్లీ కొరత ఏర్పడనుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బార్లీ…
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి భీకర పోరు సాగిస్తోంది రష్యా… ఇక, ఉక్రెయిన్ నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం అవుతుంది.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించనున్నట్టు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే కాగా.. ఇదే అంశంపై…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. సామాన్యుడి జీవితం మరింత భారంగా మారనుంది. వంట నూనె, బంగారంతో పాటు చాలా వస్తువుల రేట్లు భారీగా పెరగనున్నాయి.. మన దేశానికి వస్తున్న సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతుల్లో దాదాపు 90 శాతం వరకు రష్యా, ఉక్రెయిన్ల నుంచే దిగుమతి అవుతుంది. దేశంలో ఎక్కువ మంది వాడే వంట నూనెల్లో మొదటి స్థానం పామాయిల్ ఉంటే, రెండో స్థానం సన్ ఫ్లవర్ ఆయిల్ దే.…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులకు… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. కొందరు విద్యార్థులు… ఆయనకు కృతజ్ఞతలు తెలపగా… మరికొందరు కేంద్ర మంత్రితో సెల్ఫీలు దిగారు.…