ఉక్రెయిన్ దేశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర శంఖం పూరించి 100 రోజులు గడుస్తోంది. అయినా.. చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై రష్యా పట్టు సాధించలేక పోతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతుండడంతో.. ఇప్పటికీ రష్యా ఆధీనంలో వెళ్లి ప్రాంతాల్లో పట్టు సడలుతోంది. ఉక్రెయిన్ క్రమంగా పట్టు బిగిస్తుండడంతో.. రష్యా సైనికులు తోక మూడవక తప్పడం లేదు. రష్యా సైనికులను నష్టపోతున్నా.. తిరిగి వారిని భర్తీ చేయడంలో విఫలమవడంతో.. తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా పట్టుకోల్పోయింది. ఈ నేపథ్యంలోనే…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది… ఉక్రెయిన్ నుంచి రష్యాకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన తప్పడంలేదు.. రష్యా సరిహద్దుల్లోని ఖార్కివ్‌ను మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకుంది. రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. సిటీ కోసం జరిగిన పోరులో తాము గెలిచినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ నుంచి శత్రు దేశ దళాలు వెనుదిరుగుతున్నట్లు తెలిపింది. ఐతే ఖార్కివ్ సమీప ప్రాంతాలపై రష్యా ఇంకా బాంబు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖార్కివ్‌కు పది కిలోమీటర్ల దూరంలో…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ బలగాల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా.. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతోంది రష్యా సైన్యం.. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య పలు దపాలుగా జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు.. ఈ నెలలోనే రెండు దేశాల్లో పర్యటించబోతున్నారు. Read Also: Summer Holidays: ఏపీ…
గత కొంతకాలంగా వంటగదికి వెళ్లాలంటేనే సామాన్యులకు వణుకు పుడుతోంది. వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో కంటే సగం పైగా ధర పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా తాజాగా నిషేధం విధించింది. దీంతో ధరలు మళ్ళీ ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ధరల పెరుగుదల…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సిటీలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. వరుగా సిటీలను స్వాధీనం తీసుకుంటూ ముందుకు సాగుతోంది.. ఇక, ఉక్రెయిన్ కీలక నగరాల్లో ఒకటైన మేరియుపోల్ తమ వశమైయిందని తాజాగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దేశా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. మేరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం గొప్ప విజయంగా అభివర్ణించారు.. మిమ్మల్నందరినీ…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఆయుధాలు వీడాలంటూ ఎన్ని అల్టీమేటంలు జారీ చేసినా తమ దారికి వచ్చేందుకు ఉక్రెయిన్ సైన్యం ససేమిరా అంటుండటంతో ఆగ్రహించిన రష్యా.. మంగళవారం నాడు ఉక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడింది. రష్యాకు ఆనుకుని ఉన్న ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలు, మరికొన్ని పట్టణాలపై క్షిపణుల వర్షం కురిపించింది. 24 గంటల వ్యవధిలో దాదాపుగా వెయ్యి ప్రాంతాల్లో దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది. తమ మధ్య యుద్ధంలో కొత్త దశ…
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను చూస్తే.. వారం పది రోజుల్లో ఉక్రెయిన్ మొత్తం రష్యా ఆధీనంలోకి వస్తుందనే అంచనాలు మొదట్లో కనబడ్డాయి.. కానీ, ఉహించని రీతిలో ఉక్రెయిన్ నుంచి ఎదురుదాడి జరుగుతూనే ఉంది.. అయితే, రష్యా వైఫల్యాలకు సొంత నిఘా వ్యవస్థల్లోని గూఢచారులే కారణమని అనుమానిస్తున్నారు పుతిన్. అందుకే దాడికి ముందే రష్యా ప్లాన్ల బ్లూప్రింట్లు అమెరికా, యూకేలకు చేరాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంతో సన్నిహతులు అని కూడా చూడకుండా నిఘా విభాగం అధికారులపై కఠిన చర్యలు…
అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు ఎదురైనా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది.. ఇరు దేశాల మధ్య యుద్ధం 48వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలపై ఇంకా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా తన దాడులను కీవ్ నుంచి తూర్పు ఉక్రెయిన్ వైపు కేంద్రీకృతం చేసింది. పోర్టు సిటీ మరియుపోల్ పై నియంత్రణ సాధించే లక్ష్యంతో రష్యన్ దళాలు ముందుకు సాగుతున్నాయి. కాగా వారిని అడ్డుకునేందుకు, తమ భూభాగాన్ని…
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆంక్షలు ఎదురవుతున్నా.. యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. ఈ నేపథ్యంలో చాలా సంస్థల ఆ దేశానికి గుడ్‌బై చెప్పేస్తున్నాయి.. తాజాగా, రష్యాకు ప్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా షాక్ ఇచ్చింది. రష్యా మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై రష్యా విపణిలో తమ ఉత్పత్తులను విక్రయించబోమని తేల్చి చెప్పింది. ఫిన్లాండ్‌కు చెందిన ఈ దిగ్గజ కంపెనీ..…
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర..పుతిన్ సేనలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అంగీకరించారు. తమ సైనికుల మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడం, అక్కడి నాజీ తత్వాన్ని పారదోలడమే తమ లక్ష్యమంటూ ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌పై బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అంతులేని విషాదాలు వెలుగుచూస్తున్నాయి. ఎంతోమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలి, వలస బాటపట్టారు.…