ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై వరుస బాంబు దాడులతో విరుచుకుపడింది రష్యా. కీవ్ షాపింగ్ సెంటర్ పై దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 8 మంది చనిపోయారు. కీవ్ లో కర్ఫ్యూ విధిస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. కీలక బ్లాక్ సీ పోర్ట్ శివారులోనూ రెచ్చిపోయాయి మాస్కో బలగాలు. కొన్ని చోట్ల ఉక్రెయిన్ సామాన్య ప్రజలు రష్యా సైన్యానికి ఎదురునిలిచి దాడులు ఆపాలని నిరసనలు తెలుపుతున్నా తగ్గడం లేదు. సుమారు 2,389 మంది ఉక్రెయిన్ దేశ చిన్నారులను…
కొన్ని దేశాలు మినహా మెజార్టీ దేశాలు తనపై ఆంక్షలు విధిస్తున్నా యుద్ధంపై వెనక్కి తగ్గడం లేదు రష్యా.. 25 రోజులకు పైగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది.. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నా.. ఇక యుద్ధానికి పులిస్టాప్ అంటూ కొంత ప్రచారం సాగుతున్నా.. ఉక్రెయిన్‌పై పట్టుకోసం రష్యా బలగాలు చెమటోడుస్తూనే ఉన్నాయి.. ఉక్రెయిన్ సైన్యం నుంచి కూడా ఇంకా తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. అయితే, ఇదే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ప్రేయసిని చిక్కుల్లోకి…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో బిజినెస్ లీడర్ల సమావేశంలో మాట్లాడిన బైడెన్.. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు భారత్‌లో కనిపించట్లేదని చెప్పారు. క్వాడ్‌లో సభ్యత్వం…
ఉక్రెయిన్‌లోని ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులపైనే కాదు ప్రజల ఇళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లపైనా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా మరిమాపొల్‌లోని ఓ ఆర్ట్ స్కూల్‌పై బాంబులతో దాడి చేశాయి. దాదాపు 400 మంది తలదాచుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటివన్నీ యుద్ధ నేరాలేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. యుద్ధంలో తొలిసారిగా మొన్న ఓ ఆయుధాగారంపై కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా.. నిన్న సైతం…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి రోజులు, వారాలు గడుస్తున్నాయి. వరుసగా 23వ రోజు ఉక్రెయిన్‌లో రష్యా ఎడతెగని విధ్వంసాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు మారణహోమం సృష్టిస్తోంది. జనావాసాలపైనా రాకెట్ బాంబులు ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ ప్రధాన నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. గతంలో ఎంతో సుందరంగా, ఆహ్లాదంగా కనిపించిన ఉక్రెయిన్ నగరాలు.. ఇప్పుడు కకావికలంగా మారాయి. ఎక్కడ చూసిన కూలిన భవనాలు,…
ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ మరోసారి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పట్టుకోసం ప్రయత్నిస్తున్న రష్యా బలగాలు.. తీవ్రదాడులకు పాల్పడుతున్నాయి.. అదే స్థాయిలో ఉక్రెయిన్ సేనల నుంచి ప్రతిఘటన కూడా తప్పడంలేదు.. ఇక, ఇప్పటికే నలుగురు రష్యా మేజర్ జనరల్స్ తమ చేతితో హతమయ్యారని, 14 వేల మంది సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ చెబుతోంది.. ఇదే సమయంలో.. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో…
వరుసగా పెరుగుతూ పోయిన క్రూడాయిల్ ధరలు మళ్లీ దిగివస్తున్నాయి… ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో పరుగులు పెట్టింది క్రూడాయిల్ ధర.. ఇక, మళ్లీ ఇప్పుడు ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. మంగళవారం రెండు వారాల కనిష్టానికి చేరుకుంది క్రూడాయిల్ ధర. ఓ వైపు రష్య-ఉక్రెయిన్ మధ్య చర్చలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు… రష్యాలో కరోనా కేసులు పెరగడంతో ఆ ప్రభావం ముడి చమురు ధరలపై పడింది. బ్రెంట్ క్రూడ్ ధర 4 డాలర్లకు…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారు వ్యాపారులు. అధికారులకు సమాచారం రావటంతో ఎక్కడికక్కడే దాడులు చేస్తున్నారు. అధిక ధరలకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కేటుగాళ్ళు ప్రజల డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సాకుగా చూపించి అక్రమార్కులు చీకటి వ్యాపారానికి తెరతీశారు.…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నిర్ణయాత్మక స్థితికి చేరుకుంది. రష్యా సైనిక దాడి ప్రారంభించి 12 రోజులు అవుతోంది. తన డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి మళ్లేది లేదని పుతిన్ అంటున్నాడు. మరోవైపు, రష్యా దాడులను నిలువరించాలన్న ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ విజ్ఞప్తిపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించించింది. రష్యా దాడులను జెలెన్‌స్కీ టెర్రరిజంతో పోల్చాడు. అది యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు -ఐసీసీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది.…
ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘నో ఫ్లై జోన్’. రష్యా దాడులు ఉధృతం కావటంతో తమ గగన తలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఆయన నాటో కూటమికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే అమెరికా, పశ్చిమ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు. నోఫ్లై జోన్ ప్రకటన అంటే రష్యా విమానాలను కూల్చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే. రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టే. అప్పుడు పరిస్థితి ఇప్పటికన్నా…