Russia - Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది దాదాపు ఏడాది కావోస్తున్నా ఇంత వరకు ఏ దేశం వెనకాడడం లేదు. ఎలాగైనా శత్రుదేశాన్ని స్వాధీనం చేసుకునేంతవరకు తగ్గేదేలే అన్నట్లు దాడులను కొనసాగిస్తోంది రష్యా.
దాదాపుగా 5నెలలుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. తూర్పు యూరోపియన్ దేశానికి తన సైనిక సాయాన్ని పెంచడానికి అమెరికా ఆలోచిస్తోందని వైట్‌హౌస్ తన తాజా ప్రకటనలో వెల్లడించింది. పెంటగాన్ ఇప్పుడు ఉక్రేనియన్ దళాలకు ఫైటర్ జెట్‌లను అందించడాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిరసిస్తూ రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. రష్యాలో మెక్‌డొనాల్డ్స్ యాజమాన్య హక్కులను స్థానిక వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్ కొనుగోలు చేశారు. తాజాగా ఆదివారం మాస్కోలో సరికొత్త పేరుతో మెక్డొనాల్డ్స్ను పునఃప్రారంభించారు. దిగ్గజ ఫాస్ట్పుడ్ సంస్థ మెక్డొనాల్డ్.. రష్యాలో తన కార్యకలాపాలను కొత్త పేరుతో ఆదివారం ప్రారంభించింది.…
ఉక్రెయిన్‌పై మూడు నెలలకుపైగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా.. తాజాగా డోన్‌బాస్ ప్రాంతం 97 శాతానికి పైగా తమ నియంత్రణలోకి వచ్చిందని మంగళవారం ప్రకటించింది. ముఖ్యంగా లుహాన్స్‌క్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాదీనం చేసుకున్నామని చెప్పిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ.. పొపాస్నా, లీమన్, స్వియాటోహిర్స్‌క్ సహా 15కు పైగా నగరాలు తమ చేతికి చిక్కినట్లు వెల్లడించారు. అటు ఉక్రెయిన్ సైతం.. డొనెట్స్‌క్‌లో సగం ప్రాంతం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయిందని అంగీకరించింది. అయితే.. ఈ ఎదురుదెబ్బలకు కుంగిపోవద్దని, వీధి…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. బలమైన రష్యా ముందు కేవలం వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ రష్యాకు ఎదురొడ్డి పోరాడుతోంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు సైనికంగా, వ్యూహాత్మకంగా సాయపడటంతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురునిలిచి పోరాడుతోంది. ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేయడానికి…
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. డాన్‌బాస్ ప్రాంతంలోని మూడు కమాండ్ పాయింట్లతో పాటు సైనిక సామాగ్రి నిల్వ ఉన్న 13 స్థావరాలు, నాలుగు మందుగుండు డిపోలను ధ్వంసం చేసింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో మోహరించిన మొబైల్ యాంటీ-డ్రోన్ వ్యవస్థను రష్యా రాకెట్లు దెబ్బతీసినట్టు సమాచారం. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలే టార్గెట్‌గా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి దాదాపు నాలుగు నెలలు…