Yulia Svyrydenko: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్విరిడెన్‌కో (Yulia Svyrydenko)ను ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా గురువారం (జులై 17)న నియమించారు. 2022లో రష్యాతో జరిగిన యుద్ధం తర్వాత ఈ పదవిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ నియామకం ఉక్రెయిన్ ప్రభుత్వంలోని కీలక మార్పులలో ఓ భాగం. యుద్ధంతో అలసిపోయిన దేశ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపేందుకు,…
Ukraine Russia War: ఉక్రెయిన్ రష్యాపై భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా వైమానిక స్థావరం టార్గెట్‌గా జరిపిన దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ దేశీయ భద్రతా సంస్థ, సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (SBU) అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఉక్రెయిన్‌పై లాంగ్-రేంజ్ క్షిపణులను ప్రయోగించడానికి మోహరించే Tu-95, Tu-22 వ్యూహాత్మక బాంబర్‌లతో సహా రష్యన్ విమానాలను ఉక్రెయిన్ దళాలు నాశనం చేసినట్లు పేర్కొంది.
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మే 16న (గురువారం) టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే చర్చల కోసం పుతిన్ రాక కోసం ఎదురుచూస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రకటనను జెలెన్స్కీ తాజాగా “ఎక్స్” లో పోస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాతో వెంటనే చర్చలకు ఒప్పుకోవాలని సూచించిన వెంటనే ఈ ప్రకటన వెలువడింది. Read Also: Diamond League: నీరజ్…
Putin: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘‘ముందస్తు షరతులు లేకుండా’’ ఉక్రెయిన్‌తో చర్చలు తిరిగి ప్రారంభించడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పారు. అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయాన్ని చెప్పినట్లు శుక్రవారం క్రెమ్లిన్ తెలిపింది.
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆదివారం సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 21 మంది మరణించగా, 83 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. ఈ ఏడాది ఉక్రెయిన్‌లో జరిగిన భయంకరమైన దాడుల్లో ఇది ఒకటి. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ఖండించారు. రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
Trump-Zelenskyy meet: ఖనిజ ఒప్పందం, ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే, ఓవర్ ఆఫీస్‌లో ట్రంప్, జెలెన్క్కీ భేటీలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇది ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, ఈ విషయాన్ని రష్యా ధృవీకరించలేదు, అలాగని ఖండించలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడం గురించి పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఉక్రెయిన్‌లో సంఘర్షణను ముగించడం గురించి తాను పుతిన్‌తో మాట్లాడినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని , “ప్రజలు చనిపోవడం ఆపాలనే” కోరికను పుతిన్ వ్యక్తి చేసినట్లు నివేదించింది. Read Also: Biren Singh:…
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను కలవాలని అనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ ఇద్దరి మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని పలుమార్లు ట్రంప్ అన్నారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఇరు దేశాల మధ్య మళ్లీ భీకరమైన యుద్ధం సాగేలా సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తయారీ క్షిపణులను ఉక్రెయిన్.. రష్యాపై ప్రయోగించింది.