Uddav Thackeray: శివసేన పార్టీని, విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం తన వర్గం నేతలు, కార్యకర్తలతో ఉద్దవ్ ఠాక్రే సమావేశం అయ్యారు. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీకి బానిసగా…
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. శివసేన పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విల్లు-బాణం గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందుతాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి, శివసేన మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తాకినట్లు అయింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండేను ‘ మారలేని ద్రోహి’గా అభివర్ణించాడు. వారు శివసేన చిహ్నాన్ని దొంగలించారని..…
Shiv Sena: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ‘ విల్లు బాణం’ సీఎ ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతాయిని భారత ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. దీంతో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. గతేడాది శివసేనలో ఏక్ నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో కాంగ్రెస్-…
Mamata Banerjee criticizes BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును బీజేపీ తన పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగిస్తోందిని మంగళవారం దీదీ ఆరోపించారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Maharashtra Politics: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాలాసాహెబ్ ఠాక్రేలకు సమాజంలో దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడిన వారసత్వం ఉందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బాలాసాహెబ్ థాకరే జయంతిని పురస్కరించుకుని శివసేన (యుబిటి), విబిఎ కూటమి మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త…
Border dispute between Karnataka and Maharashtra: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలు కర్ణాటకలో విలీనం చేస్తాం అని కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై చెబుతుంటే.. మరాఠీ మాట్లాడే కర్ణాటక ప్రాంతాలను దక్కించుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ బీజేపీగా మారింది. ఒకే పార్టీకి చెందిన…
Thackeray Memorial purified: మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేకి నమ్మకస్తుండి.. తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే.. బయటకు వెళ్లిపోవడమే కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలను సైతం తన వెంట తీసుకెళ్లాడు.. దీంతో ఉద్ధవ్ సర్కార్ కూలిపోయింది.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.. దీంతో, షిండేను వెనక ఉండి…
Sanjay Raut Praises BJP's Devendra Fadnavis: పత్రాచల్ భూముల కుంభకోణంలో 103 రోజుల పాటు జైలులో ఉన్నాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక నేత సంజయ్ రౌత్. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే నిన్న జైలు నుంచి విడుదలయ్యారు సంజయ్ రౌత్. బీజేపీ అంటేనే విరుచుకుపడే సంజయ్ రౌత్.. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత…
Uddhav Thackeray's shock to BJP.. Huge lead in by-elections: మహారాష్ట్రలో బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికల్లో శివసేన వర్గం ఎమ్మెల్యే భారీ అధిక్యం దిశగా కొనసాగుతోంది. శివసేన చీలిక వర్గం ఏక్ నాథ్ షిండేతో అధికారాన్ని ఏర్పాటు చేసి బీజేపీకి తొలి దెబ్బ తాకేలా కనిపిస్తోంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.. ఎప్పుడు ఎవరు సీఎం అవుతారో..? ఎప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తారో..? ఏ పార్టీ ఎమ్మెల్యే సీఎం అవుతారో కూడా చెప్పడం కొన్నిసార్లు కష్టమే.. మహా రాజకీయాలపై ఓ కథనం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే.. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి సఫలం అయ్యారు.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్నా ఎక్కారు.. అయితే, ఇప్పుడు…