ప్రధాని మోడీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరే ప్రధాని మోడీ డిగ్రీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Savarkar Row: రాహుల్ గాంధీ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘నా పేరు సావర్కర్ కాదు, నాపేరు గాంధీ.. నేను ఎవరికి క్షమాపణలు చెప్పను’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీతో పాటు అటు ఉద్దవ్ ఠాక్రే వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము సావర్కర్ ను అభిమానిస్తామని, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. దీంతో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ…
Uddhav Thackeray: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం పరువునష్టం కేసు జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేయగా..ఈ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటమే కాకుండా.. ఎంపీగా అనర్హత వేటు…
క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ కాదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Maharastra: ఎట్టకేలకు మహారాష్ట్ర ఆధిపత్య పోరుకు తెరపడింది. ఆ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని విడిచిపెట్టి, సూడో సెక్యుటర్ ఎజెండాను అవలంభిస్తోందని బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన ఆరోపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఈ విమర్శలకు ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. బీజేపీ రథయాత్ర చేసినప్పుడు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ శివసేన అని ఉద్దవ్ అన్నారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర థానే జిల్లాలోని ముంబ్రా సబర్బన్ ప్రాంతంలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్దవ్ ఠాక్రే పార్టీ, పార్టీ గుర్తను కోల్పోవడంపై తనకు సానుభూతి లేదని ఆయన అన్నారు. ముంబ్రా ఎందుకు ఉనికిలోకి వచ్చింది.. ముంబై నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చే బలవంతం చేసింది ఎవరు..? టాడా కింద ప్రజలను జైళ్లలోకి నెట్టిన రోజులను తాను మరిచిపోలేదని అసద్ అన్నారు. ఎన్సీపికి చెందిన అజిత్ పవార్, సుప్రియా సూలే నాయకులు…
Amit Shah: శివసేన పార్టీ, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా స్పందించింది. మోదీకి మహారాష్ట్రలో ముఖం చెల్లకే బాలా సాహెబ్ ఠాక్రే ముఖాన్ని వాడుకునేందుకు పార్టీ పేరు, ఎన్నికల చిహ్నాన్ని దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏక్ నాథ్ షిండేను దొంగగా అభివర్ణించారు.