ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్ - 2 మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు..
దానా తుఫాన్ ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందనే అంచనాలతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత, అనుభవాల దృష్ట్యా.. దానా ఏం చేస్తుందో అనే టెన్షన్‌లో పడిపోయారు..
Uddanam People Stuck in Turkey: టర్కీలో భూకంపంతో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తల్లడిల్లుతోంది.కంచిలి,ఇచ్ఛాపురం, సోంపేట మండలాలకు చెందిన వందలాది మంది టర్కీ లో చిక్కుకున్నారు. వీరంతా నిర్మాణ రంగం పనుల కోసం వెళ్లారు. టర్కీ భూకంప ప్రాంతానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్నారు. మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో టర్కీలో ఉన్న సిక్కోలు వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏడాది కిందట నుంచి నిర్మాణ రంగానికి సంబంధించిన పనులకు…
Vidadala Rajini: ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 2023 నాటికి ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. రూ. 700 కోట్లతో ఉద్దానంలో ఏర్పాటు చేస్తోన్న రక్షిత మంచినీటి పథకం 80 శాతం పూర్తయిందని.. రక్షిత మంచి నీటి పథకాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఉద్ధానం కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి విడదల రజినీ ప్రశ్నించారు. బీసీల ద్రోహి…
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తరహాలో ఏపీలో మరో ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల వాసులు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 35 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క ఈ నెలలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. చీమలపాడు, దీప్లానగర్, చైతన్య నగర్, మాన్ సింగ్ తండా, రేపూడి తండా, కంభంపాడు, లక్ష్మీపురం, పెద్దతండా సహా…
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ప్రజలపై దాడి చేసిన ఎలుగుబంటి చనిపోయింది. తీవ్రమైన గాయాలతో విశాఖకు తరలిస్తుండగా ఎలుగుబంటి చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఉద్ధానంలో సోమవారం తెల్లవారుజామున పొలం పనుల కోసం వెళ్లిన కొందరిపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. కొందరు ఈ దాడి నుంచి తప్పించుకోగా ఏడుగురు వ్యక్తులు ఎలుగుబంటి దాడిలో గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఎలుగుబంటి దాడిలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా గాయపడ్డాయి. సుమారు 10 ఆవులు…