Indian Citizenship: వృత్తి, ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022లో 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రకటించింది. పార్లమెంట్ లో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులపై అడిగిన ఓ ప్రశ్నకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
Read Also: MLC Election: బీఆర్ఎస్‌తో ఎంఐఎం వరస చర్చలు.. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై నజర్
2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది, 2022లో 2,25,620 మంది భారతీయలు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యూఏఈ పౌరసత్వాన్ని పొందినట్లు ఓ నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మొత్తం 135 దేశాల పౌరసత్వాన్ని భారతీయులు పొందినట్లు వెల్లడించారు.
ఇటీవల నెలల్లో యూఎస్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల తొలగింపు విషయం ప్రభుత్వానికి తెలుసని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి మురళీధరన్ తెలిపారు. వీరిలో చాలా మంది హెచ్-1బీ, ఎల్ 1 వీసాలపై ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.