Four Day Work Week: వారానికి నాలుగురోజుల పని సక్సెస్.. ఉద్యోగులు హ్యాపీ.. పెరిగిన ఉత్పాదకత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Four-Day Work Week: ప్రపంచంలోని చాలా దేశాలు వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని కలిగి ఉన్నాయి. కానీ కొన్ని దేశాలు నాలుగు రోజుల పని వారం షెడ్యూల్‌ను ఆమోదించాయి. యూఏఈ, స్పెయిన్, స్కాట్లాండ్ ఐర్లాండ్, న్యూజిలాండ్, జపాన్ ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరించాయి. దీంతో ఉత్పాదకతలో పెరుగుదలను నమోదు చేసినట్లు గుర్తించాయి. ఈ విషయంలో యూఏఈ (షార్జా) ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. ప్రభుత్వ అధ్యయనం ప్రకారం.. వారానికి నాలుగు రోజులే పని చేయడం వల్ల ఉద్యోగుల సంతృప్తస్థాయి, మానసిక ఆరోగ్యం వంటివి కూడా మెరుగుపడ్డాయి. దీంతో కంపెనీల్లో ఉత్పాదకత పెరిగింది. ఉద్యోగుల్లో వృత్తి పరమైన సంతృప్తి, ఉత్పాదకత 90 శాతం పెరిగాయి. ఉద్యోగుల్లో సంతోష స్థాయి కూడా 91 శాతానికి చేరుకుంది.
Read Also: Taraka Ratna: తారకరత్న కోరిక బాలయ్య తీరుస్తారా!?
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
సాధారణంగా ఎక్కువ రోజులు పని చేసే వాళ్లకు వర్క్ లైఫ్-పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. కానీ, నాలుగు రోజుల పని విధానం వల్ల 84 శాతం మంది ఉద్యోగులు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. వారాంతాపు సెలవుల్ని ఆస్వాదించే వారి శాతం కూడా 95 శాతం పెరిగింది. ఈ విధానం వల్ల ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే అవకాశం దొరికింది. వాళ్లు ఖాళీ సమయంలో తమకు నచ్చిన పనులు చేసుకోగలుగుతున్నారు. హాబీస్ నెరవేర్చుకుంటూ, చదువుకుంటూ, ఇతర ప్రైవేట్ జాబ్స్ చేసుకునే టైమ్ కూడా దొరుకుతోంది. ప్రభుత్వ సంస్థల్లో 88 శాతం ఉత్పాదకత పెరిగింది. ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ కూడా 81 శాతం పెరిగింది. ఉద్యోగుల హాజరు శాతం కూడా మెరుగుపడింది. సిక్ లీవ్ రేట్ 45 శాతం తగ్గింది. ప్రస్తుతం అనేక దేశాలు నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయడంపై ఆలోచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!