Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో దాదాపుగా గత ఏడాదిన్నరగా రష్యాకే పరిమితమైన ఆ దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం పలు దేశాల పర్యటకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా కిర్గిజ్ స్థాన్‌లో పర్యటించిన పుతిన్, ఆ తర్వాత చైనాకు వెళ్లారు.
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ఆదుకునేందుకు యూఏఈ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్‌లో యూఏఈ 20-25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కకర్ సమావేశమైన తర్వాత ఈ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం దాటికి రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
lottery: గల్ఫ్ కంట్రీస్‌లో నివసిస్తున్న భారతీయలపై లాటరీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా యూఏఈ లాటరీ డ్రాల్లో భారతీయులు గెలుపొందుతున్నారు. యూఏఈలో నివసిస్తున్న కనీసం ఐదుగురు భారతీయులు వారానికి లాటరీ లేదా వీక్లీ డ్రాల్లో గెలుపొందుతున్నారు. వీరిలో ఎక్కువగా పనిచేయడానికి అక్కడికి వెళ్లిన వారినే ధనలక్ష్మీ వరిస్తోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులు ఈ లాటరీలను గెలుచుకుంటున్నారు.
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. తాజాగా ఈ యుద్ధంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఇరువురు నేతల భద్రత, మానవత పరిస్థితులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం ప్రతీ ఒక్కరికి ముఖ్యమే అని ప్రధాని మోడీ అన్నారు.
Justin Trudeau: కెనడా ప్రధాని తన తీరు మార్చుకోవడం లేదు. ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత వ్యతిరేక వైఖరి వీడటం లేదు. ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇందులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు కారణంగా ఇరు దేశాల మధ్య ఎప్పుడూ లేనంతగా దౌత్యవివాదం చెలరేగింది. అయితే ఈ వ్యాఖ్యలకు ఆరోపణలు చూపించాల్సిందిగా ఇండియా కోరితే మాత్రం అటు నుంచి స్పందన రావడం లేదు.
మహాదేవ్ యాప్‌కు సంబంధించి సుమారు రూ. 5000 కోట్ల మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. సూత్రధారి సౌరభ్ చంద్రకర్ విషయాలను బట్టబయలు చేశారు. అతను ఏ విధంగా మోసాలకు పాల్పడి ఎలా ఆనందించాడో అని వివరించారు.
UAE Defeated New Zealand for the first time in International Cricket: పసికూన యూఏఈ.. టీ20 క్రికెట్‌లో పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఓడిన యూఏఈ.. రెండో టీ20లో కివీస్‌ను సునాయాసంగా ఓడించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి మరో 26 బంతులు…
Dubai Sheikh's Hummer: సోషల్ మీడియా పుణ్యమాని నిత్యం ప్రజలను ఆశ్చర్యం కలిగించే అనేక రకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. దుబాయ్లో భారీ హమ్మర్ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ భారీ కారు చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
శనివారం అబుదాబిలో యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఏర్పాటు చేసిన విందు భోజనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పూర్తి శాఖాహార భోజనం అందించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఈరోజు యూఏఈ చేరుకున్నారు. మెనూలోని చిత్రం ప్రకారం, ప్రధాని మోదీకి మొదట స్థానిక సేంద్రీయ కూరగాయలతో పాటు హరీస్ (గోధుమలు) మరియు ఖర్జూరం సలాడ్ అందించారు. దీని తర్వాత మసాలా సాస్‌తో కాల్చిన కూరగాయలతో కూడిన స్టార్టర్ వచ్చింది..,…