టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి.
Uddanam People Stuck in Turkey: టర్కీలో భూకంపంతో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తల్లడిల్లుతోంది.కంచిలి,ఇచ్ఛాపురం, సోంపేట మండలాలకు చెందిన వందలాది మంది టర్కీ లో చిక్కుకున్నారు. వీరంతా నిర్మాణ రంగం పనుల కోసం వెళ్లారు. టర్కీ భూకంప ప్రాంతానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్నారు. మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో టర్కీలో ఉన్న సిక్కోలు వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏడాది కిందట నుంచి నిర్మాణ రంగానికి సంబంధించిన పనులకు…
Turkey Earthquake: టర్కీలో వరసగా వచ్చిన భూకంపాలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటి వరకు 5000కు పైగా మరణించారు. శిథిలాలు వెలికితీస్తుంటే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వరసగా రెండు రోజలు వ్యవధిలో 100కు పైగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇంతపెద్ద భారీ భూకంప టర్కీలో సంభవించడానికి అసలు కారణం ఏమిటి.. టర్కీ తరుచుగా భూకంపాలకు ఎందుకు గురువుతుంది..?…
Turkey Earthquake: టర్కీ దక్షిణ ప్రాంతంలో వచ్చిన భారీ భూకంపం ధాటికి టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతలో ఆ తరువాత 7.5, 6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. టర్కీ, సిరియా ప్రాంతాలు ఈ భూకంపాల ధాటికి తీవ్రగా దెబ్బతిన్నాయి.
Turkey-Syria Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో వచ్చిన భూకంపం ఆ దేశాలను మరుభూమిగా మార్చాయి. ఎక్కడ చూసిన ప్రజల ఏడుపులు, కూలిన కట్టడాలే దర్శనం ఇస్తున్నాయి. సోమవారం వచ్చిన వరస భూకంపాల ధాటికి ఆ రెండు దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 7.8, 7.6, 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీ, సిరియాలను అతలాకుతలం చేశాయి.
టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలాయి. భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది.
టర్కీ, సిరియాలను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరో రెండు భూకంపాలు సంభవించడం ఆందోళన కల్గిస్తోంది.
సోమవారం తెల్లవారు జామున టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం విలయాన్ని సృష్టించింది. ఈ భారీ భూకంపం కారణంగా 670 మందికి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.8గా నమోదైంది.