Turkey-Syria Earthquakes: మరణమృదంగం.. టర్కీ, సిరియాల్లో 15,000 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey-Syria Earthquakes: టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సహాయ శిబిరాలను సందర్శించారు. ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తడంతో ఎర్డోగాన్ అత్యంత కష్టతరమైన ప్రదేశాలలో ఒకటైన భూకంప కేంద్రం కహ్రామన్‌మారాస్‌ను సందర్శించి అక్కడ సమస్యలను పరిష్కరించారు. లోటుపాట్లు ఉన్నాయని ఒప్పుకున్న ఆన.. ఇలాంటి విపత్తుకు సిద్ధంగా ఉండటం సాధ్యం కాదని వెల్లడించారు.
భూకంపం ధాటికి టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య 15 వేలకు పైగా దాటింది. గత దశాబ్ధ కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంతగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది ఇప్పటికే ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైన భూకంపాలలో ఒకటి, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం నాటి 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీలో 12,391 మంది, సిరియాలో కనీసం 2,992 మంది మరణించారని, మొత్తం 15,383కి చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు. ఈ సంఖ్య బాగా పెరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు.బ్రస్సెల్స్‌లో ఈయూ సిరియా, టర్కీలకు అంతర్జాతీయ సహాయాన్ని సమీకరించడానికి మార్చిలో దాతల సమావేశాన్ని ప్లాన్ చేస్తోంది. అందరూ కలిసి జీవితాలను రక్షించేందుకు పని చేస్తున్నామని ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
Turkey Earthquakes: భూకంపం ధాటికి 6 మీటర్లు పక్కకు జరిగిన టర్కీ..
ప్రజలు నిద్రిస్తున్న సమయంలో 7.8-తీవ్రతతో కూడిన భూకంపం సోమవారం సంభవించింది. వేలాది నిర్మాణాలను కూల్చివేసింది. తెలియని సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు. మిలియన్ల మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.టర్కిష్ నగరాలైన గాజియాంటెప్, కహ్రామన్‌మరాస్ మధ్య భూకంప కేంద్రానికి సమీపంలో భారీ విధ్వంసం సృష్టించగా.. భవనాల మొత్తం నేలమట్టం అయ్యాయి. ఈ విధ్వంసం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మంగళవారం 10 ఆగ్నేయ ప్రావిన్సులలో మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి దారితీసింది.
వేల సంఖ్యలో కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుని.. ప్రాణాల కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని గుర్తిస్తున్న సహాయక బృందాలు వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. బెసిని నగరంలో 13 ఏళ్ల బాలిక, ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులతో ప్రాణాలతో రక్షించారు. ఇక్కడ మొత్తం 9మందిని కాపాడారు. కహ్రామన్మారస్ నగరంలో కుప్పకూలిన అపార్ట్‌మెంట్ భవన శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. అదియమాన్ నగరంలో 10 ఏళ్ల బాలికను కాపాడారు. 20 దేశాల నుంచి టర్కీకి వెళ్లిన అత్యవసర బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. భూకంప ప్రభావిత జోన్‌లో ప్రస్తుతం 60 వేలకు పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!