అనుమానిత ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సన్ అల్ ఖురాషి సిరియాలో చనిపోయినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆరపరేషన్ లో హతమయ్యినట్లు పేర్కొన్నారు.
టర్కీలో ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రకృతి బీభత్సానికి దాదాపు 50 వేల మంది ప్రాణాలుకోల్పోయారు. టర్కీ భూకంప నష్టం సుమారు 100 బిలియన్ల డాలర్లకు మించి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
India at UN: పాకిస్తాన్ ప్రజలు ఆకలితో, అధిక రేట్లు, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నా అక్కడి ప్రభుత్వానికేం పట్టడం లేదు. వీలుదొరికినప్పుడల్లా భారత్ పై విషాన్ని చిమ్ముతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శించింది. అయితే భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పింది. రక్షణ కొనుగోళ్లు, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ పై విమర్శలు చేశారు. దీనికి భారత ప్రతినిధి సీమా పుజాని స్ట్రాంగ్…
37 earthquakes strike Central Turkey in 66 hours: టర్కీ దేశాన్ని వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ నెల తొలివారంలో టర్కీని 7.8, 7.5 తీవ్రతతో ఉన్న రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్రంగా దెబ్బతీశాయి. టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియాలో కూడా తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టాలు వాటిల్లాయి. కొన్ని రోజలు వ్యవధిలోనే 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం ఏకంగా 5-6 మీటర్ల వరకు పక్కకు కదిలింది అంటే ఎంత…
Turkey Earthquake: వరస భూకంపాలతో టర్కీ అతలాకుతలం అవుతోంది. రెండు వారాల క్రితం టర్కీలో వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశంతో పాటు పక్కనే ఉన్న సిరియా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన వరస భూకంపాలు టర్కీ దక్షిణ ప్రాంతంతో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50,000 వేలను దాటింది. ఇప్పుడిప్పుడే పునరావాస చర్యలు, ఇళ్ల పునర్నిర్మాణం వేగం అవుతోంది.
Turkey Earthquake: భూకంపంలో అల్లాడుతున్న టర్కీని మరోసారి భూకంపం భయపెట్టింది. రెండు వారాల క్రితం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు టర్కీ, సిరియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. 6.4 తీవ్రతతో దక్షిణ టర్కీ నగరం అయిన అంటిక్యాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు సిరియా, లెబనాన్, ఈజిప్ట్ వరకు వెళ్లాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
OperationDost: భూకంపం కారణంగా టర్కీ, సిరియా దేశాల్లో దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
Pakistan: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 40 వేలను దాటింది. ఇదిలా ఉంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు టర్కీకి భూకంప సాయాన్ని అందిస్తున్నాయి. రెస్క్యూ నుంచి మెడిసిన్స్ వరకు అన్నింటిని సహాయంగా అందిస్తున్నాయి. అయతే టర్కీకి అత్యంత మిత్రదేశం పాకిస్తాన్ కూడా సాయం చేద్దాం అనుకుంది. అసలే పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ టర్కీకి సాయం చేసి మరోసారి పరువు తీసుకుంది.