Turkey Earthquake: టర్కీ-సిరియా భూకంపం.. ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Earthquake: టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలాయి. భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇంతటి విపత్తును ముందే అంచనా వేయలేదా అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. అయితే, ఇంతటి భూకంపం సంభవిస్తుందని ఓ పరిశోధకుడు మూడు రోజుల ముందే హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ హెచ్చరికను తేలికగా తీసుకోవడం వల్ల నష్ట తీవ్రత ఎక్కువగా ఉందనే వాదన ప్రస్తుతం మొదలైంది.
భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్.. తాజా విపత్తును ముందే అంచనా వేశారు. ‘త్వరలోనే దక్షిణ మధ్య తుర్కియే, జొర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని ఫిబ్రవరి 3నే ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన అంచనాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 6న తెల్లవారుజామున మొదలైన భూకంపం ఇంతటి విధ్వంసాన్ని సృష్టించింది. దీనిపై స్పందించిన ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఈ విషాదం తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే భూకంపం వస్తున్నట్లు ముందుగానే చెప్పానని.. అది 115 ఏళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఉంటుందని అన్నారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేశామన్నారు. స్థానికంగా ఇప్పటివరకు సంభవించిన దాంట్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈయన చెప్పినట్లుగానే గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి.
Also Read
- TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
- Punam Raut Retires: "చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా".. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
- Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV
— Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023
అయితే మొదట ఫ్రాంక్ హూగర్‌బీట్స్ హెచ్చరించిన సమయంలో ఆయన ట్వీట్లను ఎవరూ నమ్మలేదు. ముందస్తుగా చేసిన హెచ్చరికలపై విమర్శలు కూడా వచ్చాయి. భూకంపాలను ఎవరూ అంచనా వేయలేరని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే భారీ భూకంపం సంభవించడంతో ఫ్రాంక్ హూగర్‌బీట్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయన ట్వీట్‌ను చాలా మంది రీట్వీట్లు చేస్తున్నారు. ఆయన హెచ్చరించిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!