అమ్మా, నాన్నల తర్వాత అన్న లేదా అక్క తమ చెల్లెళ్ళు, తమ్ముళ్ళకు చేదోడు వాదోడుగా నిలుస్తుంటారు. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా వారే అండగా ఉంటారు. టర్కీ, సిరియాలో సంభవించిన పెను భూకంపం తీరని విషాదం నింపింది. వేల సంఖ్యలో ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎన్నో వేల మంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తుంటే ఎన్నో విషాదకర దృశ్యాలు బయటపడుతున్నాయి.
Read Also: Viral Video: జో బైడెన్ భార్య, కమలా హారిస్ భర్త.. చట్టసభలోనే ఇలా.. వీడియో వైరల్
ఇంతటి విషాదంలోనూ ఒక దృశ్యం యావత్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథిలాల కింద ఓ బాలిక, తన తమ్ముడితో ఇరుక్కుపోయింది. స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్ సపోర్టుగా ఉండడంతో వారు ప్రాణాలతో బిక్కు బిక్కు మంటూ అక్కడే ఉండిపోయారు. ప్రాణభయంతో గంటల పాటు శిథిలాల కిందే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బాలిక తన తమ్ముడి కోసం ఆరాటపడింది. శిథిలాల కింత ఇరుక్కుపోయాడు తమ్ముడు. అతడి తలకు ఆ బాలిక తన చేయిని అడ్డంపెట్టింది. రక్షించింది. నీకు నేనున్నాను.. నీకేం కాదని భరోసా కల్పించింది. అక్కా తమ్ముడి ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తమ్ముడికి ధైర్యం చెబుతూ ఆ బాలిక సహాయం కోసం ఎదురుచూసింది. ఈ ఫొటో చూసిన నెటిజెన్లు బాలికను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు టర్కీ, సిరియాల్లో కనిపిస్తున్నాయి. జనం చేత కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి.
Read Also: MLA’s Purchase: ఎమ్మెల్యేల ఎర కేసు.. 17న విచారిస్తామన్న సుప్రీం కోర్టు