పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సుల్లో భూకంపం సంభవించింది. ప్రకంపనలు కారణంగా పలు భవనాలు కూలిపోయాయి. మూడు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. అయితే ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ చాలా డేంజరెస్ గేమ్ ఆడుతోంది. ఇస్లామిక్, అరబ్ దేశాల్లో ఉన్న భయాలను పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటోంది. ఇస్లామిక్ ప్రపంచంలో కేవలం పాక్ వద్ద మాత్రమే అణు బాంబు ఉంది. ఈ బలంతో తాము ఇతర ఇస్లామిక్ దేశాలను రక్షిస్తామనే భ్రమను కల్పిస్తోంది.
6.1 Earthquake Hits Turkey: పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. బలికెసిర్ ప్రావిన్సులోని సిందిర్గిలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యాటక ప్రాంతాలైన ఇస్తాంబుల్, ఇజ్మీర్ సహా పశ్చిమాన ఉన్న అనేక నగరాల్లో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. రాత్రి 7:53 గంటలకు భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 4.6…
Tayfun Block-4: పాకిస్తాన్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్‌కు హైపర్సోనిక్ వెర్షన్.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సైనిక మద్దతు ఇచ్చిందా? అనే ప్రశ్నపై చైనా ప్రభుత్వం స్పందించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు సైనిక మద్దతు అందించిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని చైనా తన అనేక రక్షణ వ్యవస్థలను పరీక్షించడానికి 'లైవ్ ల్యాబ్'గా ఉపయోగించుకుందని అన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీప దేశం సైప్రస్ చేసుకున్నారు. మోడీ లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ప్రోటోకాల్ పక్కనపెట్టి, స్వయంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 15-16 తేదీల్లో సైప్రస్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తున్న ప్రధాని మోడీ, మార్గం మధ్యలో…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు, దీనికి మోడీ ఒప్పుకున్నారు. అయితే, కెనడాకు వెళ్తూ, మార్గం మధ్యలో సైప్రస్‌లో ప్రధాని మోడీ ఆగనున్నట్లు తెలుస్తోంది.
Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
Indian YouTuber: టర్కీలో ఇండియన్ యూట్యూబర్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టర్కిష్ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అనుచిత, అసభ్యకరమై వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ‘‘మాలిక్ స్వాష్‌బక్లర్’’ అని పిలువబడే మాలిక్ ఎస్డీ ఖాన్, తన ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలపై విమర్శలకు గురయ్యాడు. టర్కిష్ మహిళపై లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో మాలిక్ తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి ఈ…
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ పంపిన డ్రోన్లను భారత్ అడ్డుకుంది. వందల సంఖ్యలో పాకిస్తాన్ పంపిన డ్రోన్లు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంది. టర్కీకి చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన బైరెక్తర్ TB2 డ్రోన్ వలయాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. ఒక్క డ్రోన్ కూడా తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత స్వదేశీ తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ‘‘ఆకాష్ తీర్’’ వ్యవస్థ టర్కిష్ డ్రోన్లను కూల్చేసింది.