Minister Seethakka : ములుగు జిల్లా మంజీరా ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క రైతులకు ఆయిల్ ఫార్మ్ పంట ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆయిల్ ఫార్మ్ సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. 10 ఎకరాల భూమి ఉన్న రైతులు కనీసం ఐదు ఎకరాలలో ఈ పంటను సాగు చేయాలి. ఈ పంటకు ఉన్న గ్యారంటీ మరే పంటకు లేదు” అని తెలిపారు. రైతుల భారం తగ్గించేందుకు సబ్సిడీతో ఒక్కో మొక్కను రూ.25కే…
Tummala Nageshwara Rao : ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, సమకాలీన పరిస్థితులపై తన గుండెతల్లిపడే భావాలను వ్యక్తపరిచారు. ‘‘రాజకీయాలు ఈ రోజుల్లో చాలా కలుషితమయ్యాయి. ప్రజాస్వామిక విలువలు మరిచిపోతున్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. అన్నింటినీ గాడిలో పెట్టే బాధ్యత ఇప్పటికీ మీడియాదే’’ అని తుమ్మల స్పష్టం చేశారు. వాటి పక్షపాతాలు, అర్థం లేని ప్రచారాలు తప్ప నిజాలను రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని పార్టీలు తప్పుడు…
సోషల్ మీడియా వేదికగా(ఎక్స్) కేటీఆర్ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు.. చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదు.. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యం అని ఎక్స్ లో…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఆయన ఈ రోజు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పత్తి సేకరణ కోసం సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
Tummala Nageshwar Rao: ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ ను కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతును మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంచానని తెలిపారు.
Ponguleti-Tummala: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.
ఒక చోట ఉండి.. మరొకరితో కాపురం చేయద్దని టీఆర్‌ఎస్ నేతలపై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది పార్టీని నాశనం చేయాలని చూశారని.. పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించారని తెలిపారు. ఒక చోట ఉండి మరొక చోట కాపురం చేయడం మంచిదికాదని ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీలోని కొంతమంది నేతలను ఉద్దేశించి అన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడబోమని… భవిష్యత్‌లో అందరూ కలిసి ప్రయాణం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…