తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం దాదాపు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, స్వామివారి దర్శనానికి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
తిరుమల తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేపుతుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ లో రెండేళ్ల బాబు కిడ్నాప్ కు గురయ్యాడు. రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర కిడ్నాప్ చేశారు. అయితే, శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన కుటుంబం వచ్చింది.
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇప్పటి వరకే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది.
తిరుమల కొండపైన భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. వరుస సెలవులు ఉండటంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో పూర్తిగా నిండిపోయి క్యూలైన్ దాదాపు కిలో మీటరు మేరకు శిలాతోరణం వరకు భారీగా వేచి ఉన్నారు.