Rishabh Pant, Axar Patel Visits Tirupati Balaji Temple Today: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ ఇద్దరు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఆలయ అధికారులు పంత్, అక్షర్కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి.. స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం…
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ రిలీజ్ చేస్తుంది.
Tirumala Brahmotsavam 2023 ends on Monday: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదోవ రోజు కొనసాగుతోంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణ రథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికే అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉదయం స్వర్ణ రథంపై అధిష్ఠించిన స్వామికి భక్తులు నీరాజనాలు పలికారు. నేడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాహన…
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సాలకు మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 1800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.. గరుడ సేవ రోజు 1253 మంది పోలీసులు అదనంగా బందోబస్తులో పాల్గొంటారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు , గాదిరాజు వెంకట సుబ్బరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను అలరించేలా 14 రాష్ట్రాల నుంచి కళా బృందాలు విచ్చేస్తున్నట్లు టీటీడీ జేఈవో సదా భార్గవి వెల్లడించారు.
తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శనివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.