తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సాలకు మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 1800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.. గరుడ సేవ రోజు 1253 మంది పోలీసులు అదనంగా బందోబస్తులో పాల్గొంటారు.. ఈనెల 19 న గరుడ వాహన సేవకు పటిష్ట మైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. అలిపిరి దగ్గర ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం.. బయట ప్రాంతాలు నుంచి వాహనాల్లో వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
Read Also: President Gallantry Medals: నాలుగు శౌర్య పతకాలు ఒక పతకంగా విలీనం.. ఇప్పుడు ఈ పేరుతోనే పిలుస్తారు..
ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు అని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15 వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. తిరుమల మాడ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం ఉంది.. గరుడ వాహనం సమయంలో మాడ వీధుల్లోకి వెళ్ళే విధంగా ఐదు క్యూ లైన్ పాయింట్ ఏర్పాటు చేశారు.. భక్తులు సంయమనం పాటించాలి అని ఆయన తెలిపారు. చిన్న పిల్లలకు జియో ట్యాగింగ్ విధానం అందుబాటులో ఉంటుంది అని ఎస్పీ వెల్లడించారు.
Read Also: PUN vs AP: టీ20ల్లో అత్యధిక స్కోరు ఇదే.. ఆర్సీబీ రికార్డును బద్దలు కొట్టిన పంజాబ్
అయితే, దిగువ ఘాట్ రోడ్ లో నిబంధనలు పాటిస్తూ వాహనాలు వెళ్ళాలి అని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. తిరుపతి నగరంలో గరుడ వాహన సేవ రోజు ట్రాఫిక్ ఆంక్షలు అమలు, వాహనాలు మళ్లింపు, నిర్దేశించిన పార్కింగ్ లో వాహనాలు నిలపాలి అని ఆయన చెప్పారు. నడక మార్గంలో వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు.