Tirumala: కాసేపట్లో తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ రిలీజ్ చేస్తుంది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఈరోజు ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే, శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకోవాలనుకుంటున్న భక్తులు టీటీడీకి చెందిన ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే జనవరి నెలకు సంబంధించి నిన్న ( సోమవారం ) శ్రీవాణి భక్తుల దర్శనం టిక్కెట్లతో పాటు వసతి కోటా టిక్కెట్లను కూడా విడుదల చేసింది.
Read Also: Road Accident: తమిళనాడులో రోడ్ టెర్రర్.. లారీ-సుమో ఢీ, 7 మంది మృతి
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
అయితే, తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయల విరాళం అందించాడు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన వికాస్ కుమార్ కిషోర్ బాయ్ ఆదివారం రాత్రి అశ్వవాహన సేవలో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి డీడీని ఇచ్చారు. అలాగే, అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ శుక్రవారం టీటీడీ అన్నప్రసాదం విభాగానికి 9.5 టన్నుల బరువు గల 2 లక్షల రూపాయల విలువైన కూరగాయలను విరాళంగా ఇచ్చారు. ఈ కూరగాయలను తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అధికారులకు అందించారు.
తాజావార్తలు
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!