తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
టీటీడీలో అర్హత వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని.. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కాంట్రాక్ట్ మరియు కార్పొరేషన్ పరిధిలో వున్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యులరైజ్ చేయనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.