Group-1 Exam: రేపటితో ముగియనున్న గ్రూప్-1 దరఖాస్తు గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Exam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 563 పోస్టుల భర్తీ ఈ ప్రకటన జారీ కాగా.. మార్చి 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. గ్రూప్ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల దరఖాస్తులు వచ్చాయి. రేపు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.
గతంలో అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు ఫీజు చెల్లించిన కారణంగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Also Read
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
Read Also: Temperature: నిప్పుల కొలిమిగా నంద్యాల.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
how to apply TS Group 1: ఇలా దరఖాస్తు చేసుకోండి….
*గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లోకి వెళ్లాలి.
*ఓటీఆర్ లేని వారు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్(New Registration OTR) ఉన్నవారికి అవసరం లేదు.
*గ్రూప్ 1 ఆన్ లైన్ దరఖాస్తుల ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
*మీ ఓటీఆర్ వివరాలతో లాగిన్ కావాలి.
*మీ వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
*ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుం చెల్లించాలి.
*సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!