TGPSC: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షా ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను సర్వీస్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి మెరిట్ జాబితా పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్ష ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ప్రకటించింది. ఈ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంది.
TGPSC ల్యాబ్ టెక్నీషియన్ మెరిట్ లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.tspsc.gov.in/
హోమ్‌పేజీలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మెరిట్ జాబితాను శోధించండి
కొత్త విభాగంలో “జనరల్ ర్యాంక్ జాబితా – ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – II” ఎంచుకోండి
ల్యాబ్ టెక్నీషియన్ మెరిట్ లిస్ట్ 2023 PDF లో మీ మెరిట్ జాబితా, మార్కులను తనిఖీ చేయండి.
భవిష్యత్ ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ తీసుకోండి.
TGPSC జూనియర్ లెక్చరర్ మెరిట్ లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://www.tspsc.gov.in/
హోమ్‌పేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టుల మెరిట్ జాబితాను శోధించండి
కొత్త విభాగంలో “జనరల్ ర్యాంక్ జాబితా – జూనియర్ లెక్చరర్” ఎంచుకోండి
జూనియర్ లెక్చరర్ మెరిట్ లిస్ట్ 2023 PDF లో మీ మెరిట్ జాబితా, మార్కులను తనిఖీ చేయండి.
భవిష్యత్ ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ తీసుకోండి.