TSPSC Group-1: గ్రూప్-1 కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు! ఒక్కో పోస్టుకు 715 మంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group-1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఈ నెల 14 వరకు అవకాశం ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. ఆ తర్వాత మరో రెండు రోజులు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. ఈ పోస్టులు ఎక్కువగా ఉండటంతో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. శనివారం సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగిసింది. దీంతో మొత్తం 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష నిర్వహించే సమయంలో బయోమెట్రిక్ తీసుకోకపోగా, హైకోర్టు తీర్పుతో మరోసారి పరీక్షను రద్దు చేశారు. ఫలితంగా ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
Read also: Kareena Kapoor-Yash: కేజీఎఫ్ స్టార్ ‘యశ్’ సరసన కరీనా కపూర్?
Also Read
- El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
- Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
- Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
మరో 60 పోస్టులతో సహా 563 గ్రూప్-1 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గత నోటిఫికేషన్‌లో 503 పోస్టులకు 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 563 పోస్టులకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడుతున్నారు. కాగా, దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సవరించుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. కాగా, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న నిర్వహిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించగా.. ఈ మరాకు కూడా ఏర్పాట్లు ప్రారంభించింది. గతంలో పేపర్ లీకేజీ నేపథ్యంలో.. ఈసారి గ్రూప్-1 పరీక్షను కట్టుదిట్టమైన చర్యలతో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది.
Ayodhya: అయోధ్య వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 24 గంటలు బాలరాముడి దర్శనం..!
తాజావార్తలు
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. వన్డేల్లో జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!