TSPSC Group 1: గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group 1: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని TSPSC తేల్చి చెప్పింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 9న పరీక్ష నిర్వహించేందుకు జూన్ 1 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు వచ్చాయి. దీంతో గ్రూప్-1కి దరఖాస్తు చేసుకున్న వారిలో నిరుద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చిందని, నిరుద్యోగులదీ అదే పరిస్థితి ఎదుర్కొన్నారన్నారు.
Read also: Heavy Rains: తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. 14 మంది మృతి..
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
ఎన్నికలకు సిద్ధం కాలేదని, ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు కనీసం రెండు నెలలపాటు ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని అభ్యర్థించారు. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు. గ్రూప్-1 పరీక్షల పేరుతో గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పట్టభద్రులకు ఓటు వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఈ వాస్తవాన్ని ఎన్నికల సంఘం గ్రహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు బిల్ నాగరాజు యాదవ్, నాగేంద్రరావు, అవినాష్, చిలుకల రాకేష్ తదితరులున్నారు.
Read also: Israel air strike in rafah: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కనీసం 35 మంది మృతి
మరోవైపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో మొత్తం 536 ఖాళీల కోసం గ్రూప్ 1 స్థానాలకు రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష 9 జూన్ 2024న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో జరగనుంది, పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు TSPSC గ్రూప్ 1 పరీక్షకు హాజరు కావచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు తమ TSPSC గ్రూప్ 1 హాల్ టిక్కెట్‌ను పరీక్ష తేదీకి ముందు అధికారిక TSPSC వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసి, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి, ఎందుకంటే ఇది పరీక్షకు కూర్చోవడానికి వారి అర్హతను ధృవీకరిస్తుంది.
Kavya Maran: కెమెరా కంట పడకుండా.. వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న కావ్య మారన్!
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!