తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఇక, తెలంగాణ అసెంబ్లీలోని శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ తమిళిసై కన్సెంట్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం సీఎం కేసీఆర్ సర్కార్ మార్గం సుగమం చేసింది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్ అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాల్లో దరఖాస్తులు మొదలైన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆదాయంలో 33 శాతం రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది. ఆగస్టు 4 నుంచి 18 వ తేదీ వరకు దరఖాస్తులను అధికారులు తీసుకుంటారు. ఆగస్టు 21వ తేదీన ఏర్పాటు చేసిన స్థలాలలో డ్రా ఉంటుంది. దరఖాస్తు దారులు స్వయంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని రావాల్సి ఉంటుంది అని ఇప్పటికే ఎక్సైజ్…
వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను నేడు (మంగళవారం) రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జారీ చేశారు. జిల్లాలు, శాఖలు, పోస్టు కేటాయించేందుకు అవసరమైన సమాచారాన్ని పంపాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ కొలువుకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఈ మేరకు నేడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.గతంలో 2022 జూన్ 12 న టెట్ పరీక్షను నిర్వహించింది. తాజాగా విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబర్ 27న…
ఇవాళ ( సోమవారం ) జరిగిన కేబినెట్ సమావేశంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం, ప్రతి ఒక్కరు హర్షించదగిన విషయం.. ఈ విలీన నిర్ణయం తీసుకున్నందుకు TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి JAC కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.