తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు.అయితే ఉపాధ్యాయ నియామక పరీక్ష తేదీలు, సిలబస్ మరియు అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. దీనిప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయ నియామక…
తెలంగాణ రాష్ట్రం లో డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ చేయాలనీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని కూడా నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికి రోస్టర్‌ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించనుంది.. దీంతో కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి రానుంది.. ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. పోస్టుల వారీగా రోస్టర్ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో…
బీఆర్ఎస్ నాయకులారా.. మీరు నిజమైన తెలంగాణ వాదులైతే.. మీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే తక్షణమే ఆ పార్టీని వీడి రండి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు.
CM KCR: దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్ సాక్షాత్తు ప్రారంభించారు.
Tamilisai: టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహణకు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.టెట్ ఎగ్జామ్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ నెల 27వ తేదీన పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.. ఈ క్రమంలోనే ఎగ్జామ్ కు సంబంధించి విద్యాశాఖ కొన్ని ముఖ్య సూచనలను…
కాకతీయ యూనివర్సిటీ లో పీహెచ్డీ అడ్మిషన్స్ లో అవకతవకలు జరిగాయి అని ఎబివిపి, ఇతర బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు
TS Govt: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ రోజుకో శుభవార్త చెబుతూనే ఉన్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా... ఇప్పటికే పింఛన్లు పెంచడం, జీతాలు పెంచడం... ఇలా ఎన్నో శుభవార్తలు చెబుతున్నారు.
కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి విశ్వకర్మ సంఘం నేతలతో పాటుజహీరాబాద్ కు చెందిన వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ చాలా మందితో మాట్లాడారు.. వారందరూ పార్టీలో చేరనున్నారు అని ఆయన పేర్కొన్నారు.