తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను నేడు (మంగళవారం) రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జారీ చేశారు. జిల్లాలు, శాఖలు, పోస్టు కేటాయించేందుకు అవసరమైన సమాచారాన్ని పంపాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి బాధ్యతలను అర్హతలను బట్టి కేటాయించనున్నారు. శాఖల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను వెంటనే పంపాలని నవీన్ మిట్టల్ తెలిపారు. వీఆర్ఏలకు, 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు శాఖల కేటాయింపు ప్రక్రియను మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలన్నారు.
Read Also: Haryana Voilence: హర్యానాలో ఆగని హింసాకాండ.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు
ఈ ఏడాది జూన్ 31 నాటి వయస్సును ప్రామాణికంగా తీసుకోనున్నాట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ అన్నారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకాలు చేపడతారు.. వీఆర్ఏల అర్హతలను బట్టి జిల్లాల వారీగా రెగ్యులర్, సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాలో ఖాళీగా ఉన్న కొలువుల ఆధారంగానే కేటాయింపు ఉంటుంది అని అన్నారు.
Read Also: Transfer of Tahsildars: తెలంగాణ వ్యాప్తంగా తహశీల్దార్ల బదిలీలు..
ఒకవేళ ఇతర జిల్లాలకు కేటాయిస్తే ఆ జాబితాను విడుదల చేయాలి అని నవీన్ మిట్టల్ తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆ జిల్లా కలెక్టర్ కి రిపోర్ట్ చేయొచ్చు.. నియామకపు ఉత్తర్వులు జారీ కాగానే వీఆర్ఏలను వెంటనే ఆయా మండల తహశీల్దార్లు వారిని రిలీవ్ చేయాలి అని చెప్పారు. ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఎలాంటి సిఫారసులు చెల్లవు అని పేర్కొన్నారు. వారికి కేటాయించినట్లుగా రిపోర్టింగ్ ఆఫీసర్ కి రిపోర్ట్ చేయాల్సిందేన్నారు. 61 సంవత్సరాలు నిండిన వారు వారి కుటుంబ సభ్యులకు ఎన్వోసీ పత్రాలను సమర్పించాలన్నారు.
Read Also: Canada: కెనడా భారతీయుడికి జైలు శిక్ష.. మానవ అక్రమ రవాణా కేసులో శిక్ష ఖరారు
కారుణ్య నియామకపు పత్రాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోనున్నారు. కుటుంబ సభ్యుల విద్యార్హతలను బట్టి పోస్టింగ్ ఉంటుంది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ మొత్తం ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అఫిడవిట్, కుటుంబ సభ్యుల నుంచి ఎన్వోసీ పత్రం వంటివి తీసుకోనున్నారు. వాటితో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల ధృవపత్రాలు, ఎన్వోసీలు, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఆధార్ కార్డులాంటివి కూడా ప్రతి వీఆర్ఏ జత చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.