తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఆదాయం రాబట్టేందుకు ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సర్కార్ ఖజానాకు కాసులు రాల్చే వనరుల్లో అతి ప్రధానమైన మద్యం టెండర్లను రెండు నెలల ముందుగానే నిర్వహిస్తుంది. ప్రస్తుత లైసెన్స్ గడువు నవంబరు నెల చివరి వరకు ఉన్నా.. మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. పథకాల అమలుకు ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు వైన్‌షాపుల కేటాయింపునకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇవాళ్టి( శుక్రవారం ) నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
Read Also: Heavy Rains: బీజింగ్లో భారీ వర్షాలు.. వరదల్లో వేలాది మంది జనాలు
ఇక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్ అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాల్లో దరఖాస్తులు మొదలైన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆదాయంలో 33 శాతం రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది. ఆగస్టు 4 నుంచి 18 వ తేదీ వరకు దరఖాస్తులను అధికారులు తీసుకుంటారు. ఆగస్టు 21వ తేదీన ఏర్పాటు చేసిన స్థలాలలో డ్రా ఉంటుంది. దరఖాస్తు దారులు స్వయంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని రావాల్సి ఉంటుంది అని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. మొదటి రోజు 10 అప్లికేషన్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ప్రతిసారి లాగానే నిబంధనలు ఉన్నాయి.. 2 లక్షల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ చెల్లించి.. దరఖాస్తు చేసుకోవాలి.. ఒక వ్యక్తి ఎన్ని వైన్ షాప్స్ కు అయిన దరఖాస్తు చేసుకోవచ్చు అని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు.