ఇవాళ ( సోమవారం ) జరిగిన కేబినెట్ సమావేశంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం, ప్రతి ఒక్కరు హర్షించదగిన విషయం.. ఈ విలీన నిర్ణయం తీసుకున్నందుకు TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి JAC కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: Sujitha: ‘వదినమ్మ’ వదిన స్టార్ హీరోయిన్ అని తెలుసా.. వారి విడాకులు.. ?
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఏకైక డిమాండ్ తో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆవిర్భవించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోకు ఈ యొక్క నినాదం తీసుకెళ్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఘనత TJMUకే దక్కుతుందని రాష్ట్ర వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ కన్వీనర్ హనుమంతు తెలియజేశారు. ఈ యొక్క విజయం రాష్ట్రంలో ఉన్న అందరి ఆర్టీసీ కార్మికుల విజయమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Drinking Water: ఆ మహిళకు నీళ్లు తాగితే ప్రాణానికే ప్రమాదం..!
రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక చైతన్య యాత్ర చేసి టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మొట్టమొదటిగా సమ్మె నోటీసు ఇచ్చిన యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్.. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు గర్వంగా ఉందన్నారు. సమ్మె సమయములో ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని అన్నారు.. కానీ ఈరోజు సుసాధ్యం చేసి చూపించడం చాలా సంతోషకరమని అన్నారు. టీఎస్ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని రావలసిన బకాయిలన్నీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ కన్వీనర్ హనుమంతు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.