వరంగల్ దశ తిరగనుందా? ఓరుల్లు ఇక హెల్త్ సిటీగా రూపుదిద్దుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న వరంగల్ నగరంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణానికి సంబంధించి జీవో విడుదలైంది. 15 ఎకరాల్లో 1,100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. 24 ఫ్లోర్లతో భారీ భవన సముదాయం, 2,000 పడకలు ఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ కోసం…
ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్నారు న్యాయవాది అభినవ్. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్‌లో…
కరోనా మహమ్మారి విజృంభణతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి… ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి… ఇదే, సమయంలో.. సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో మాత్రం యాథావిధిగా నో పార్కింగ్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో…
సీనియర్ ఐపీఎస్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)కు ఆమోదం తెలిపింది రాష్ట్ర సర్కార్.. ఆయన చేసుకున్న వీఆర్ఎస్ దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది… కాగా, 26 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసిన ఈ ఐపీఎస్… ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. ఇంకా స్వేచ్ఛగా…
హుజారాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. అక్రమంగా జైల్లో ఉంచినా ఈటలను హుజురాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంచి, నీతివంతమైన, కమీషన్లు లేని, ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఇస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, అవకాశ వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు,…
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఏడేళ్ల పాలన తెలంగాణ ప్రజల ఆత్మ ఘోష కు ఉపయోగపడే పాలన అని ధ్వజ మెత్తారు. ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయిందన్నారు. రాష్ట్రం ఆరంభంలోనే ఇది భౌగోళికంగా తెలంగాణ…
వ్యాక్సిన్ల కొరత రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. తెలంగాణలోనూ అదే పరిస్థితి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్.. కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ వ్యాక్సినేషన్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అందిరికీ వ్యాక్సిన్…
తెలంగాణలోకి వచ్చే పేషెంట్లకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి చేసిన సర్కార్… కోవిడ్ పేషెంట్ల అడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంబులెన్స్ లేదా వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని.. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తిరగడం వల్ల కూడా కరోనా వస్తుందని..పేర్కొంది సర్కార్. ఎపిడమిక్ యాక్ట్…