తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచారు. ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీం…
HMDA : తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిధిని విస్తరిస్తామని ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ రోజు దాన్ని పూర్తి చేసింది. హెచ్ ఎండీఏ పరిధిలోకి 36 రెవెన్యూ గ్రామాలను కలిపేసింది. దీంతో హెచ్ ఎండీఏ పరిధిలో 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాల వరకు పరిధి పెరిగిపోయింది. ఇంతకు ముందు 7 జిల్లాల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 11 జిల్లాల…
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశ ప్రగతి, ఉద్యోగాల గురించి మాట్లాడటం లేదని.. ముస్లిం రిజెర్వేషన్ ఎత్తేస్తామని చెబుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గతంలో అమిత్ షా మాట్లాడితేనే కోర్టులో కేసు వేశామని గుర్తుచేశారు.
లిక్కర్ లో ప్రభుత్వ పాలసీ ఉంటది.. కానీ అనధికార పాలసీ ఉంటదా? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "మద్యం అందుబాటులో లేకుంటే సేల్స్ తగ్గాలి. కానీ ఎందుకు పెరిగింది సేల్స్.
పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
కుమారి ఆంటీ అందరికీ సుపరిచితమే. హైదరాబాద్‌లో ఫుడ్ వ్యాపారం చేసి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమె ఫేమస్ అవ్వడంతో భారీగా జనాలు ఫుడ్ సెంటర్ కి వచ్చే వాళ్లు. రోడ్‌పై ఫుడ్ అమ్మడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నందున.. పోలీసులు అక్కడ వ్యాపారం చేసుకోకూడదని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగకు బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. ఇంట్లో ఎన్నికల ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఉన్న ఈ వేడికి తట్టుకోలేని పరిస్థితి. ఈ వేడిమికి జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నెలలు నిండకుండానే జన్మించిన పసికందులకు ఎంజీంలోని పీడియాట్రిక్ యూనిట్ ఐసీయూ/హెచ్‌డీయూ వార్డుల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటారు. వీరి కోసం రెండు వార్డుల్లో కలిపి నాలుగు చొప్పున 8 ఏసీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పని చేయడం లేదు.. ఓ వైపు ఎండలతో ఉష్ణోగ్రత స్థాయి పెరిగి పసికందులు తల్లడిల్లిపోతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు తనకు తెలంగాణ ప్రజల మధ్య బీఆర్ఎస్ నేతలు గ్యాప్ క్రియేట్ చేశారని ఆరోపించారు.
పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు. కారణం ఏదైనా సమయానికి చేరుకోవాలని పబ్లిక్ పరీక్షల సమయంలో అధికారులు చెబుతూనే ఉంటారు. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థులు లోపలికి అనుమతించమని ఏడుస్తూ.. ఉపాధ్యాయులు, అధికారుల కాళ్లవేళ్ల పడటం మనం చూస్తుంటాం.