TS Govt : టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ కొలువుకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఈ మేరకు నేడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.గతంలో 2022 జూన్ 12 న టెట్ పరీక్షను నిర్వహించింది. తాజాగా విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు . ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. . పేపర్-1 పరీక్షకు డీఈడీ మరియు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశమును ఎన్సిటీఈ కల్పించింది.. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.కాగా, ఇటీవల నిర్వహించిన సమావేశంలో టెట్ నిర్వహణకు తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలను రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శికి అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నేడు నోటిఫికేషన్‌ను విడుదల చేసారు. ఈ టెట్ పరీక్ష కోసం రాష్టంలో 1.5 లక్షల డీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు అలాగే 4.5 లక్షల మంది బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గతంలో టెట్‌కు కేవలం 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా రెండు సంవత్సరాల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం వరకు పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పోటీపడే అవకాశం కేవలం డీఈడీ చేసిన వారికే ఉండగా ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఎంతో ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది పైగా టెట్ క్వాలిఫై కానివారు వున్నారు.. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకు ఉన్నట్లు సమాచారం.తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కింది
Also Read
- IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Tags
- 2023
- tet notification
- TS Govt
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!