ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో బంగార్మావు వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్‌కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సహరాన్‌పూర్ బైపాస్ హైవే రాంపూర్ మణిహారన్ సమీపంలోని ఛాలెంజ్ గేట్ సమీపంలోని వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు.
ఓ ట్రక్కు అకస్మాత్తుగా పెట్రోల్ పంప్ లోకి దూసుకెళ్లింది. హైవేపై ఓ ట్రక్కు పెట్రోల్ పంప్‌ను ఢీకొట్టింది. మహారాష్ట్రలోని పూణె-సతారా హైవేపై చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఏడుగురు మరణించారు. మరో 40మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Accident : ఉత్తరప్రదేశ్లోని షాజహాపూర్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు.
Dead Body In Truck: పుణెలోని లోనికండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ లారీ డ్రైవర్ల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీసింది.