Road Accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోరం.. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని రాష్ట్ర రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పురూలియా ఎస్పీ అవిజిత్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ట్రక్కు మొదట ఓ బైక్ను ఢీకొట్టగా.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు.
Maneka Gandhi: వరుణ్‌గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తల్లి ఏమన్నారంటే..!
Also Read
ఈ క్రమంలో.. డ్రైవర్‌ను పట్టుకునేందుకు స్థానికులు ట్రక్కు వైపు పరుగులు తీయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ గందరగోళంలో.. త్రీవీలర్‌ను ఢీకొట్టాడు.. ఆ తర్వాత కొంతమంది పాదచారులను ఢీకొన్నాడని పోలీసులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నితుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్వారి మోడ్‌లో నివసించే కొందరు వ్యక్తులు అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని వగర్దంగా గ్రామంలో ఒక వివాహ వేడుక నుండి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో.. భమురియా గ్రామ సమీపంలోని మలుపు వద్ద ట్రక్కు ఆటోను ఢీకొట్టిందన్నారు. దీంతో ఆటో డ్రైవర్‌తో సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మృతుల్లో శ్యామపాడ్ మండల్ (74), భాగ్యవతి మండల్ (63), మృదుల్ మండల్ (45) ఉన్నారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయని.. అతడిని నితుదియ బ్లాక్ ఆస్పత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.
TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..
ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మొత్తం ఐదుగురు చనిపోగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ట్రక్కును వెంబడించి పర్వేలియా గ్రామ సమీపంలో బలవంతంగా ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?