ఓ ట్రక్కు అకస్మాత్తుగా పెట్రోల్ పంప్ లోకి దూసుకెళ్లింది. హైవేపై ఓ ట్రక్కు పెట్రోల్ పంప్‌ను ఢీకొట్టింది. మహారాష్ట్రలోని పూణె-సతారా హైవేపై చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏప్రిల్ 22న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో హైవేపై ఉన్న పెట్రోల్ పంపు వద్ద ట్రక్కు ఆగడంతో ఈ ఘటన జరిగింది. డీజిల్ కోసం ట్రక్ డ్రైవర్ పెట్రోల్ పంపులోకి వెళ్తుండగా నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్కు డీజిల్ డిస్పెన్సర్‌ను ఢీకొట్టింది. దానిని పూర్తిగా కూల్చివేసింది. ముందున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటన అంతా ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనలో పెద్దగా గాయాలు కానప్పటికీ, ప్రమాదం తరువాత గందరగోళం ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read:India’s First Water Metro: దేశంలో తొలి వాటర్ మెట్రో…నేడే ప్రారంభం