మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలోని పితంపూర్‌లో రైల్వే వంతెన నిర్మాణ పనుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా భారీ క్రేన్ బోల్తా పడింది.
మహా కుంభమేళాలో మరో ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి మినీ బస్సులో బయల్దేరిన భక్తులను ట్రక్కు రూపంలో మృత్యువు వెంటాడింది.
ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. తాజాగా మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ మెక్సికోలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టిందని మెక్సికోలోని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో ఈఘోరం చోటుచేసుకుందని…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాజీపూర్‌లో భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురి మృతిచెందినట్లు తెలుస్తోంది.
Ethiopia: ఇథియోపియాలోని బోనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో 71మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
ట్రక్కును నడపాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. ఏ మాత్రం అజాగ్రత్త వహించిన భారీ మూల్యం తప్పదు. అయితే.. లారీ నడిపేటప్పుడు స్టీరింగ్‌పై రెండు చేతులు ఉంచి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కాళ్లు బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్‌ను నియంత్రిస్తాయి. వీటితో పాటు చేతితో గేర్లు వేస్తాం. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కేవలం తన పాదాలతో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ.. వాహనాన్ని నడపడం కనిపిస్తుంది.
అగ్ర రాజ్యం అమెరికాలోని మెక్సికోలో సైన్యం జరిపిన కాల్పుల్లో భారతీయుడి సహా ఆరుగురు వలసదారులు మృతిచెందారు. ట్రక్కులో వెళ్తుండగా కాల్పులు జరపడంతో సంఘటనాస్థలిలో నలుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీళ్లంతా భారత్, నేపాల్, పాకిస్థాన్, తదితర దేశాల నుంచి వలసవచ్చినవారిగా తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.