Accident: బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రెజిల్‌లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రి వేళ ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపక శాఖ అవుట్‌పోస్ట్ ఒక ప్రకటనలో పేర్కొనింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది బాధితులు మినీ బస్సులో ఉన్నారని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బహియా సివిల్ పోలీసులు వెల్లడించారు.