పూణెలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఫుడ్ ఇవ్వడానికి హోటల్ సిబ్బంది నిరాకరించినందుకు ట్రక్కుతో హోటల్ ముందు నానా బీభత్సం సృష్టించాడు ఓ డ్రైవర్. హోటల్ ముందు భాగాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాకుండా అక్కడే నిలిపి ఉన్న కారును ఢీకొట్టాడు. దీంతో కారు డ్యామేజ్ అయింది. హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వెనక్కి తగ్గలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Bakhtiarpur Car Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తియార్‌పూర్- బీహార్‌షరీఫ్ రోడ్డులోని మానసరోవర్ పంప్ సమీపంలో స్కార్పియో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు.
కర్ణాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును మినీ బస్సు ఢీకొనడంతో కనీసం 13 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోని మృతులు శివమొగ్గ వాసులుగా గుర్తించారు. బెళగావి జిల్లా సవదత్తి నుంచి యల్లమ్మ దేవిని దర్శించుకుని తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని.. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.…
యూపీ కౌశాంబిలోని భర్వారీలోని కోఖ్‌రాజ్ హైవేపై సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ మెడ మొండెం నుంచి విడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళ తలను వెనుక నుంచి వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో.. తల శరీరం నుంచి విడిపోయింది.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం సేలంలో జరిగింది. కాగా.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ మల్వాన్‌లోని ఉన్నావ్‌లో ఇసుకతో కూడిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెపై బోల్తా పడింది.
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని రాష్ట్ర రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పురూలియా ఎస్పీ అవిజిత్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ట్రక్కు మొదట ఓ బైక్‌ను ఢీకొట్టగా.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో బంగార్మావు వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.