బీజేపీకి రాజీనామా చేసి మంత్రి సబితా రెడ్డి సమక్షంలో బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ ను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో పెద్ద ఎత్తున అనుచరులతో టి ఆర్ ఎస్ లో చేరిన బీజేపీ సర్పంచ్ ను టి ఆర్ ఎస్ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానించారు. ఈ…
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి తారాస్థాయికి చేరిందని టిపిసిసి అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వరంగల్ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 27 గ్రామాల పంటలు ద్వంసం చేసే విధంగా వున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ అండగా నిలబడడంతో ల్యాండ్ పూలింగ్ ని తాత్కాలికంగా నిలిపివేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 27 గ్రామాలు 5…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఖానాపూర్ సోషల్ మీడియా గ్రూప్‌లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తన రోజు వారి కార్యక్రమాలు, టూర్ షెడ్యూల్, హజరైన కార్యక్రమాల ఫోటోలు పెడుతున్నారు. అదే గ్రూప్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కార్యక్రమాలు సైతం పోస్ట్ చేస్తున్నారు. అయితే రాథోడ్ జనార్దన్ వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారని ప్రచారం ఉండటంతో వర్గపోరుకు తెరతీసింది. దాంతో…
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం టీఆర్ఎస్‌లో అగ్గి రాజేస్తోంది. అధికారులు చేస్తున్నారో లేక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారో అర్థం కావడం లేదన్నది కేడర్ చెప్పేమాట. ఇటీవల మంత్రి హరీష్‌రావు పర్యటనలో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రొటోకాల్ రగడ వర్గపోరు తీవ్రతను బయటపెట్టింది. మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన మాతాశిశు కేంద్రం శిలాఫలకంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు కన్నా పైన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేరు చెక్కించారు. దీనిపై కొప్పుల…
జులైలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి ఐక్య పోరాటం చేయవచ్చనే అందోళన బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలో, అధికార పార్టీ ముందుగానే అప్రమత్తమై కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలపై దృష్టి సారించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు గల ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఇందులో ప్రతిపక్షాల ఉమ్మడి బలం బీజేపీ, దాని మిత్రపక్షాల కంటే కాస్త ఎక్కువగా ఉంది. కనుక,…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-2023 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 37 చోట్ల ఇంటర్ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మరో 26 మంజూరు చేయాలని రాష్ట్ర…
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. మంత్రి హరీష్‌రావు బుధవారం మాట్లాడుతూ.. బీజేపీ ఎందుకోసం యాత్రలు చేస్తోందని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఏమి సాధించారని పాదయాత్ర చేస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్పాలని పాదయాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. మోడీ నిర్ణయాలు పేదల…
టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ధరణి వెబ్‌సైట్ రైతాంగానికి శాపంగా మారిందని ఆరోపించారు. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూదాన్, ల్యాండ్ సీలింగ్ భూములపై కేసీఆర్ కన్ను పడిందని, ల్యాండ్ పుల్లింగ్ పేరుతో భూములను గుంజు కుంటూ, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ప్రభుత్వం కూడా బ్రోకర్ పని చేస్తోందని…
తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా వేడి పుట్టింది. దీనికి కారణం రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ రావడమే. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి 2024 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉండిపోయింది. ఆ భర్తీ ప్రక్రియలో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దాంతో టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనే అంశం చుట్టూ చర్చ ఊపందుకుంటోంది. రెండేళ్లే పదవీకాలం ఉన్నప్పటికీ చాలామంది టీఆర్‌ఎస్ నేతలు…
సింగరేణి కార్మిక చైతన్య యాత్ర ముగింపు సభలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించిన సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన కూడా సింగరేణిని ఇంకా దారిద్య్ర పరిస్థితికి కారణం కేసీఆర్ అనే ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నన్ను టీఆర్‌ఎస్ పార్టీ నుండి మెడలు పట్టి బయటికి పంపించిందని, అయినా నాకు ఇంకో సారి తెలంగాణ కొరకు యుద్ధం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈటల…