కేంద్ర ప్రభుత్వంపై మరోసారి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. మంత్రి హరీష్‌రావు బుధవారం మాట్లాడుతూ.. బీజేపీ ఎందుకోసం యాత్రలు చేస్తోందని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఏమి సాధించారని పాదయాత్ర చేస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్పాలని పాదయాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు.
మోడీ నిర్ణయాలు పేదల ఉసురు తీస్తున్నాయని, రూ. 2.50 లక్షల కోట్ల సబ్సిడీ బకాయిలు కేంద్రం ఇవ్వాలని.. ఎప్పుడు వచ్చేలా చేస్తావ్ బండి సంజయ్ సమాధానం చెప్పు అని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. పేదల కోసం రైతు బీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలయ్యే పథకాలు అమలు చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.