ఇందిరా, పీవీలు ప్రధానిగా ఉన్నప్పుడు పేదలకు భూములు ఇచ్చారని జాతీయ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాగీర్ దార్ల వద్ద 45 ఎకరాల కంటే ఎక్కువగా ఉండొద్దని చట్టం ఉందని, గతంలో.. 48 లక్షల ఎకరాల భూమిని పంపిణి చేశారన్నారు. అంతేకాకుండా ఆ భూమిని.. కేవలం వ్యవసాయం చేసుకోవాలి, అమ్ముకోడానికి వీలులేదని క్లాజ్ పెట్టారన్నారు. అంత సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. వైఎస్సార్ కూడా తన తండ్రి…
ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అయితే దీనిపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ ని ప్రతీ ఒక్కరికి తెలియాలని రాహుల్ గాంధీ అన్నారన్నారు. రైతు డిక్లరేషన్‌లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందని, రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపికి భయంపట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాహుల్…
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట సత్తా చాటిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ అని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లాయే లేదని, మెడికల్…
ఈయన పేరు శివరాజ్ పాటిల్. కర్నాటకలోని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే. ఇక ఈయన.. రాజేందర్‌రెడ్డి. తెలంగాణలోని నారాయణపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇద్దరిదీ వేర్వేరు రాష్ట్రాలైనా.. సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో నారాయణపేటలో రాజేందర్‌రెడ్డిని ఓడించడానికి ప్రచారం చేస్తానని పాటిల్ అంటే.. అదే విధంగా కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. దీంతో ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? ఎందుకు శపథాలు చేసుకుంటున్నారు అనేది చర్చగా మారింది. తెలంగాణలో…
తెలంగాణ రాజకీయాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చుట్టూ చర్చ సాగుతూనే ఉంది.. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న అందరినీ తొలచివేస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీ నేతలను కలిసినా.. ఆ పార్టీలో చేరతారు అనే ప్రచారం ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంటుంది. తాజాగా, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సమావేశం కావడంతో.. మరోసారి పొలిటికల్ పార్టీ రీ ఎంట్రీ చర్చ తెరపైకి వచ్చింది. అయితే, తాను ఏ…
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై బీజేపీ నిలదీస్తోంది. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ మూర్ఖుడు, ఆదివాసీ, గిరిజన వ్యతిరేఖి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనులకు 9.8 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కులాన్ని,…
బీజేపీ నేతలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం హరీష్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న పాలమూరు మీటింగులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు.. బీజేపీ మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయ లోపం…
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పీవీని, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళను ప్రధానినీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడు భట్టిని సీఎల్పీ నేతగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దళితున్ని ఓర్వలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచ చరిత్ర మీదంటూ టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. రాహుల్ మీద నువ్వు ఏ…
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని…