Bhatti Vikramarka: కేసీఆర్ తప్పు చేస్తున్నావ్ జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొదలు పెట్టిన పాదయాత్ర గురువారం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చేరుకుంది. అక్కడే అంకమ్మ దేవాలయాన్ని పున:ప్రారంభం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే గ్రామంలోని ప్రజల సమస్యలను వింటూ పాదయాత్రను కొనసాగించారు.
పాదయాత్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూనే.. టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రకటించారు. దీంతో పాటు రైతు కూలీలకు రూ.12,000 ఇస్తామన్నారు. వరికి బోనస్ ప్రకటించి రూ. 2500లకు కొంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలరకు పంచిన భూములను ప్రభుత్వం వెనక్కి లాక్కుంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు చేస్తున్నావ్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఖ్యాతి ఉన్నా కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా తెలంగాణలోకి అధికారంలోకి రాలేదు. గత రెండు పర్యాయాలుగా ప్రతిపక్షానికే పరిమితం అయింది. ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని, తెలంగాణలోకి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రధాన పార్టీలు తమ ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభిస్తున్న వాతావరణం కనిపిస్తోంది.
ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు చేస్తోంది. ఇటీవల వరంగల్ సభకు రాహుల్ గాంధీ రావడం, రైతు డిక్లరేషన్ ప్రకటించడం చూస్తే మెయిన్ టార్గెట్ అధికారమే అని తెలుస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ను తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు వివరించేం‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. దీంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!