గ్రేటర్ హైదరాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగినట్టు అయ్యింది… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించిన మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి.. పదవిని ఆశించారు.. అది దక్కకపోవడంతో కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఆమె టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు.. త్వరలోనే మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు స్వయంగా ఆమె ప్రకటించారు.. ఇవాళ పీసీసీ…
కెసీఆర్ జాతీయ పార్టీ ..ఇప్పుడిదే సంచలనం..రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ…ఈ పార్టీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఒకటైతే.. అసలు ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణాది జాతీయ పార్టీ నిలబడుతుందా అనేది మరో చర్చ..గులాబీ పార్టీ పునాదులపై నిలిచే బీఆర్‌ఎస్ కున్న సాధ్యాసాధ్యాలేంటి?ఇదే ఈ రోజు స్టోరీ బోర్డ్. చాలా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైతే చాలా వరకు ఊహాగానాలే.కానీ, కెసీఆర్ వ్యూహాలు సామాన్యంగా ఉండవనేది అందరూ ఒప్పుకునే విషయమే. అందుకే బీఆరెస్ విషయంలో క్లారిటీ వచ్చే వరకు ఈ ఉత్కంఠ…
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల కష్టాలు తెలుసుకునెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బయలుదేరనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ట్రిపుల్ ఐటీ నిర్వహణ కూడా కేసీఆర్ కి సాధ్యం కావడం లేదని విమర్శించారు. ఇంకా ట్రిపుల్ ఐటి ఎలా మంజూరు చేస్తారు ? అని ప్రశ్నించారు. సిల్లి ముఖ్యమంత్రి కి సమస్యలు సిల్లిగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. సమస్యలు సిల్లి అయితే… ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారడం.. ఆ…
గోషామహల్. హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో రాజకీయ వేడి ఎక్కువగా ఉన్న సెగ్మెంట్. గత ఎన్నికల్లో బిజెపి నుంచి రాజాసింగ్ గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే. అక్కడ ఓడిన టీఆర్ఎస్‌లో మాత్రం ఇప్పటికీ సీన్ మారలేదట. ఆ ఎన్నికల్లో నాయకులు ఏవిధంగా అయితే తన్నుకున్నారో.. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందట. నేతలు ఎక్కువైపోయారు. కేడర్‌ను పట్టించుకోవడం లేదు. పైగా ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారే…
తెలంగాణ ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేజిక్కుంచుకొంది. మూడవసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్‌తో గులాబీపార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆ సంస్థ పలు నివేదికలను టీఆర్ఎస్ పెద్దలకు అందచేస్తోంది. సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించారట. ఆ విషయాలను వడపోసిన తర్వాత టీఆర్ఎస్ వేగంగా చర్యలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.…
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లిలోని రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీ ఒక టీఎంసీ కోసం ఆలోచించిందని, ఇప్పుడు మనం 8.23 టీఎంసీలుగా మార్చామని ఆయన వెల్లడించారు. భూ నిర్వాసితులకు 98 శాతం పరిహారం అందించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి,…
గురునాథ్‌రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన.. కారులో ఇమడ లేకపోతున్నారట. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారపార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కడం లేదని కొంతకాలంగా మథన పడుతున్నారట గురునాథరెడ్డి. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల నియోజకవర్గంలోని కోస్గి పట్టణానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆ కార్యక్రమానికి గురునాథరెడ్డిని ఆహ్వానించలేదట. అయినప్పటికీ బహిరంగ సభ వద్దకు వచ్చిన…
ఉండవల్లి అరుణ్ కుమార్. మాజీ ఎంపీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సడెన్‌గా హాట్ హాట్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్‌గా ఉంటూ.. కీలక అంశాలపై అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాజకీయ వేడి కాక మీద ఉంది. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకెళ్లాలని చూస్తున్న సీఎం కేసీఆర్ BRS పేరుతో కొత్త నేషనల్ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. అలాంటి కేసీఆర్‌తో ఉండవల్లి భేటీ కావడం…
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. గురువారం కొడంగల్‌లో పర్యటించిన హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేయలేక పోయారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్త రూపు సంతరించుకున్నదని, రేపో మాపో పాలమూరు నీళ్ళు తెచ్చి మీ పాదాలు కడుగుతామన్నారు. పాలమూరు పై…