ఆరూరి రమేష్. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్దన్నపేట ఎమ్మెల్యే. జిల్లా రాజకీయాలతోపాటు.. టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు రమేష్. ఆయన చుట్టూనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన ప్లాన్ రివర్స్ కావడంతో పొలిటికల్‌గా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. ఆయనకు ఆయనే ఇరకాటంలో పడ్డారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. గ్రేటర్ వరంగల్ అభివృద్ధి పేరిట ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. వరంగల్ చుట్టూ 49 కిలోమీటర్ల ORR నిర్మించేందుకుగాను 28…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు వినూత్నంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మరోసారి పోటీ చేస్తారా లేక.. ఆయనకు బదులుగా కొత్తగా పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ ఇస్తారా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకులు వేములవాడలో పోటాపోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదే స్పీడ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కేడర్‌ను మరింత గందరగోళంలోకి నెడుతోందట. కొంతకాలంగా ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై వివాదం చెలరేగుతోంది. సమస్య కోర్టు…
* మరోసారి రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని పేర్కొన్న ఈడీ, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే వరుసగా మూడు రోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు. * నేడు చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ పిలుపు, సోమాజిగూడ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతల ర్యాలీ * అనకాపల్లి జిల్లాలో రెండు రోజు చంద్రబాబు పర్యటన, అనకాపల్లిలో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకలాపాలపై సమీక్ష *…
‘‘ మోదీ మస్ట్ రిజైన్’’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల శ్రీలంకలోని ఓ పవర్ ప్రాజెక్ట్ ను అదానికి కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై మోదీ ఒత్తడి తీసుకువచ్చారనే వార్తల నేపథ్యంలో ఈ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులతో పాటు వేలాది మంది నెటిజెన్లు మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి ట్విట్టర్…
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వం విధానాలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల కేంద్రం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు కేటీఆర్. ప్రతపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత కేంద్రంపై భారీ ఒత్తిడి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.…
ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రంలో మోదీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి భేష్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మోదీ 8 ఏళ్ల పాలన గురించి మెదక్ లో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 కు ముందు కేసీఆర్ ఏం మాట్లాడాడు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తున్నాడో చెప్పాలి అని ప్రశ్నించాడు. కేసీఆర్ మాటలు, చేతలకు పొంతన ఉండదని అన్నారు. కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే అని ఆయన అన్నారు.…
మహిళల భద్రతపై, సమస్యలపై రోశయ్య హాయాంలో సమావేశం జరిగిందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో ఒక్కసారి కూడా సమావేశం పెట్టలేదని విమర్శించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ప్రతిపక్ష నాయకులు ప్రగతి భవన్ కు ఎలా వచ్చారని సమీక్ష చేసుకుంటారు కానీ.. తెలంగాణలో మహిళలపై దాడి చేస్తే సమీక్ష ఎందుకు చేయరని ప్రశ్నించారు. సీఎంకు తన భద్రత మీద ఉన్న శ్రద్ధ.. మహిళల భద్రతపై లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆయన గురించే ఆలోచిస్తున్నారు..ఆయన గురించే…
దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని జాతీయ పార్టీలు వైఫల్యం చెందాయని విమర్శించారు. దేశ అభివృద్ధిలో ఏ ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకమైన పద్దతిలో పని చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన మొదటి నుండి అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ…
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని…
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు…