నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో రూ.170 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసగించారు. పల్లెలో నర్సరీ, రైతు వేదికలు, ఇంటింటికీ నల్లా, ట్రాక్టర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్. కరెంటు సమస్య తీరింది, 24గంటలు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనేనని ఆయన వెల్లడించారు. కృష్ణా నీటి వాటాను కేంద్రం తేల్చలేదని, నార్లాపూర్, ఏదుల, కర్వెన, ఉధండాపూర్ ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం చేస్తామని ఆయన వెల్లడించారు. డబుల్ బెడ్రూం,పింఛన్లు,…
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న అలర్లు దానికి నిదర్శనం. అయితే అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తుతుంటే.. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌ఫోర్స్ లాంటి విభాగాల్లో అగ్నివీరులకు ప్రత్యేక కేటాయింపు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. స్విస్ బ్యాంకుల నుంచి…
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చామని అయినా అభివృద్ధి జరగలేదని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు మంత్రి కేటీఆర్. కోల్లాపూర్ లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన మందులాంటిది కాంగ్రెస్ అని.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెస్తామని చెప్పారని.. మాట…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై నిరసనజ్వాలలు దేశవ్యాప్తంగా రగులుతున్నాయి. అయితే నిన్న అగ్రిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సుమారు 2000 మంది ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించి, దాదాపు 8 రైళ్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లోని ఇతర సామాగ్రిని సైతం చెల్లాచెదురు చేశారు. మొత్తం 20 కోట్ల వరకు అస్తినష్టం వాటిల్లిందని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా ఈ ఘటనపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ…
మోడీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వరంగల్ బిడ్డ రాకేష్ బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మండి పడ్డారు. బీజేపీ కి ఇక శంకర గిరి మాన్యాలే అంటూ విమర్శించారు. మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ జూసిన వారెవ్వరూ బాగు పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి పుట్టగతులు లేకుండా చేస్తామని నిప్పులు చెరిగారు.…
ఆయన పాన్ షాపు సంజయ్..! ఈయన కుర్కురే రెడ్డి.. ! అంటూ.. బండి సంజయ్ , కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బాల్కసుమన్ సెటైర్లు విసిరారు. అగ్ని పథ్ పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి భాద్యత మోడీ సర్కార్ దే.. మరెవ్వరిది కాదని మండిపడ్డారు. ఆర్మీలో చేరడాన్ని దైవ కార్యంగా యువత భావిస్తుందని కొనియాడారు. ఇలాంటి స్కీం ను కూడా మిగతా మూర్ఖపు స్కీం లాగా మోడీ తెచ్చి యువత ఆగ్రహానికి కారణమయ్యారని మండిపడ్డారు.…
సికింద్రాబాద్ ఆందోళనల్లో మరణించిన ఆర్మీ విద్యార్థిపై టీఆర్ఎస్ జెండా కప్పి చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ వేదికగా మండిపడింది. ఆ వీరుడి అంతిమ యాత్రలో ఉండాల్సింది, భారత త్రివర్ణ పతాకమని.. ఫాసిస్టు పింకు జండాలు కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్ విద్యార్థి చావు ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాబందులు శవాల మీద వాలి పీక్కు తినడం తెరాస నాయకులను చూసే నేర్చుకున్నాయేమో…
సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. అగ్నిపథ్‌తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోందని ఆయన ఆరోపించారు. దాడుల వెనుక ఇక్కడ టీఆర్ఎస్ హస్తం ఉంటే.. యూపీలో ఎవరి హస్తం ఉన్నట్లు అని ఆయన ఎద్దేవా…
అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్రం వైఖరి మారాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బిహార్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా.. అక్కడ హింస ఎలా జరిగిందని బండి సంజయ్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అక్కడ బీజేపీ కుట్ర చేసిందా అంటూ ప్రశ్నించారు. బండి సంజయ్ మూర్ఖపు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని గంగుల మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కోణంలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో పల్లెప్రగతి…
సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు. నిన్నటి ఘటన పై మాట్లాడిన డికె అరుణ, నిన్న జరిగిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామని డీకే అరుణ అన్నారు. శాంతియుత నిరసనకు వచ్చిన వారిని…