గ్రేటర్ హైదరాబాద్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగినట్టు అయ్యింది… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించిన మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి.. పదవిని ఆశించారు.. అది దక్కకపోవడంతో కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఆమె టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు.. త్వరలోనే మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు స్వయంగా ఆమె ప్రకటించారు.. ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు విజయారెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని వెల్లడించారు.
Read Also: AP Polycet Result 2022: ఏపీ పాలి సెట్ ఫలితాలు విడుదల
మా నాన్న సీఎల్పీ లీడర్‌గా పని చేశారు, ఆఖరి వరకు పార్టీలో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు విజయారెడ్డి… ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం దేశానికి అవసరమన్న ఆమె.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానన్నారు. ఇక, ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరతా.. మా నాన్న రాజకీయాల్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.. అయితే, కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీలో తనకు గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఉన్నారు విజయారెడ్డి.. ఈ పరిణామాలను ముందే పసిగట్టిన టీఆర్ఎస్.. ఆమెను ఆపేందుకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. విజయారెడ్డితో మాట్లాడగా.. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని వారికి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుండగా.. ఇప్పుడు రేవంత్‌రెడ్డితో సమావేశమై.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది.