తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సినీ, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు కొత్త ఛైర్మన్ ను నియమించింది. టీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ. సెల్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ కూర్మాచలం ను ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామ్మోహన్ పదవి కాలం పూర్తి అయ్యి చాలా యేళ్ళు గడిచినా ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిపై దృష్టి పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.…
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులు మరో పోరాటంకి సిద్దం అవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దం అవ్వండని, పొడు భూములకు పట్టాలు ఇస్తారు అని నమ్మినము.. కానీ మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది.. భూములు పంచింది కాంగ్రెస్సే అని ఆయన వెల్లడించారు. మిగిలి ఉన్న భూములకు కూడా పట్టాలు కాంగ్రెస్ ఇస్తుందని…
రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్‌కార్డులు జారీ చేయనున్నుట్లు ప్రకటించారు. నేడు నగరంలో కైతలాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్ మాట్లాడుతూ.. అతి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘మీ శాసనసభ్యుడు, కార్పొరేట్ల చేతుల మీదుగా.. మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా.. ఎవరి చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీమే.. మీ కార్పొరేటరే వచ్చి.. ఎవరు ఎవరు అర్హులున్నారో ఒక్కరూ మిస్ కాకుండా ఇచ్చే…
భాగ్యనగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్‌డీపీ కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. 3117 కోట్ల రూపాయలతో రెండో దశ ఎస్ఆర్‌డీపీ మొదలు పెడతామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. కూకట్‌పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని.. ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే…
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ టిఆర్ఎస్‌లో వర్గపోరు 2018 నుంచి అనేక మలుపులు తిరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారారావు ఓడిపోగా.. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి గెలిచారు. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్‌తో ఎమ్మెల్యే బీరం కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటినుంచి కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ రెండు గ్రూపులుగా చీలి, వర్గపోరు రకరకాలుగా బుసలు కొడుతోంది. ఈ సమస్యపై మొదట్లోనే పార్టీ పెద్దలు దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరిని చేర్చుకోవాలి? ఎవరికి నో చెప్పాలి అనేదానిపై క్లారిటీ ఇచ్చేందుకు కమిటీ వేసింది పార్టీ. సీనియర్ నేత జానారెడ్డి ఆ చేరికల కమిటీకి ఛైర్మన్. ఎవరైనా కాంగ్రెస్‌లో చేరతానని ముందుకొస్తే.. కమిటీలో చర్చించి.. స్థానిక నాయకత్వంతో మాట్లాడతారు. ఏ మూహూర్తాన జనారెడ్డి కమిటీని వేశారో కానీ.. కాంగ్రెస్‌లో చేరుతున్న వారి గురించి ఆ కమిటీకి సమచారమే లేదు. చర్చల్లేవ్.. చర్చించడాలు లేవు. ప్రస్తుతం ఇదే పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. మంచిర్యాల నుంచి TRS…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ భూములను వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో రాజీవ్ స్వగృహ భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాటి కాంగ్రెస్ సర్కార్ లబ్ధిదారుల నుంచి తీసుకున్న డిపాజిట్ నుంచి 2 కోట్లతో రైతుల నుంచి 67 ఎకరాలు సేకరించిందని, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కలెక్టర్ అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు వివాదాలున్నా ..…
బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు రోజులుగా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో బాసర విద్యార్థుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అందులో.. బాసర ఐఐఐటీ విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ ఆందోళన చేస్తున్నారని, వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మరో వైపు మీ పుత్ర…
విజయారెడ్డి. కాంగ్రెస్ దివంగత నేత PJR కుమార్తె. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్. రాజకీయ ప్రయాణాన్ని వైసీపీ నుంచి మొదలుపెట్టిన ఆమె.. 2014లో ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారామె. ఖైరతాబాద్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2018లో మరోసారి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలని విజయారెడ్డి ఆశించినా.. టీఆర్ఎస్ మాత్రం దానం నాగేందర్‌కు ఛాన్స్ ఇచ్చింది. తనకు రావాల్సిన సీటును దానం తన్నుకుపోయారని…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ…